Press Clipping 21-10-2025
పార్వతీపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి)
1.సీతంపేటలో
ఏజెన్సీ వాసులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జిల్లాలో మరో డయాల సిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రక టించింది. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం కింద సీతంపేటలో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమా రు రూ.75 లక్షలతో రక్తశుద్ది యంత్రాలు, పరికరాలు సమకూర్చనున్నారు. పీపీపీ విధానంలో సీతంపేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని నిర్వ హించనున్నారు. నిర్వహణ బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. రోజూ మూడు సెషన్స్ ద్వారా
కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కిడ్నీ బాధితులకు ఎంత దయాలసిస్ కేంద్రం తీరనున్న కష్టాలు.
2. పారదర్శకంగా ధాన్యం సేకరణ:
జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో పారదర్శకంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం పార్వ తీపురం మండలం వెంకంపేటలో ఉన్న రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించారు.. ఈ సందర్భంగా మిల్లర్లు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో మాట్లాడారు. రైతు లకు మంచి గోనె సంచులు ఇవ్వాల న్నారు. సాయంత్రం 5గంటల వరకు ట్రక్ షీట్లు జనరేట్ అవుతాయని తెలి పారు. అనంతరం చినబొండపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. టార్పాలిన్లు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసు కున్నారు. మిల్లర్లను సమన్వ యం చేసుకుంటూ కస్టోడియన్ అధి కారులు పనిచేయాలని ఆదేశించారు.
సాలూరు రూరల్ అక్టోబర్ 20(ఆంధ్రప్రభ) : మండలంలో జలపాతాలు, సుందర ప్రాంతాలకు కొదవ లేదు. అయితే అవి అభివృద్ధికి నోచుకోక పర్యాటకులు పోవడంతో పొరుగు రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో ఉండే పర్యాటక ప్రాంతాలకు తరచూ వెళ్లి వస్తున్నారు. రానున్న శీతాకాలంలో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాలూరు టౌన్ తోపాటు విజయనగరం, విశాఖపట్నం తదితర దూర ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులు మండలంలోని తోణాం, నేరెళ్ల వలస మీదుగా ఒడిశా లోని దేవుమలై, గాలి గబడారు (ఆంధ్ర-ఒడిశా వివాదస్పద గ్రామం) జలపాతం వద్దకు వెళ్లి వస్తుంటారు. అయితే ప్రస్తుత జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర రెడ్డి జిల్లాలోని సుందర జలపాతాల పరిసరాలను అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేందుకు, తద్వారా ఆ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించేందుకు యోచించి ఈ బాధ్యతను డిఆర్డిఏ పిడి సుధారాణికి అప్పగించారు. దానితో ఆమె వెలుగు సిబ్బందితో మండలంలో పర్యటించి, దళాయి వలస, కురుకూటి, దండిగాం, శిఖ పరువు, కుంభి మడ, లొద్ద తదితర జలపాతాలను చూసి ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించారు. అక్కడితో ఆగకుండా ఆయా ప్రాంతాల సమీప గ్రామాల ప్ర జలతో మాట్లాడి మీ చెంతనే ఉన్న ప్రకృతి అందాలను అభివృద్ధి చేసుకుంటే, పర్యాటకులు వచ్చి వెళతారని, దాని వల్ల ఆదాయం అభివృద్ధి చెందుతుందని
శిఖపరువు, దళాయివలస జలపాతాల వద్ద సౌకర్యాలపై దృష్టి
వివరించారు. ఇదే విషయమై ఆయా పంచాయితీల సర్పంచులు, గ్రామ పెద్దలతో మాట్లాడి పర్యాటక రంగం పై దృష్టి సారించి అభివృద్ధి చేస్తే కలిగే లాభాలను వివరించారు. దీనితో దళాయి వలస, శిఖ పరువు జలపాతాలను అభివృద్ధి చేసేందుకు, వెలుగు సంస్థ సహకారంతో షాపులు ఏర్పాటు చేసేందుకు కొంత మంది ముందుకు వచ్చారు. అందులో భాగంగా గత రెండు రోజులుగా కురుకూటి సర్పంచ్ వంతల ఎండమ్మ భర్త అప్పన్న ముందుకొచ్చి దళాయి వలస జలపాతం వద్ద పిచ్చి మొక్కలను తొలగించి, జంగిల్ క్లియరెన్స్ చేయిస్తూ, అక్కడకు వెళ్ళే దారిని చదును చేసి శుభ్రం చేయిస్తున్నారు. అలాగే జలపాతం వద్దకు వెళ్లేందుకు వాగు పై వెదురు బొంగులతో వం తన నిర్మించారు. ఇక శిఖ పరువు జలపాతం విషయానికి వస్తే, ఆ ప్రాంతానికి చెందిన కొంత మంది యువకులు మోటారు బైకుల పై పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చారు. అదేవిదంగా కొంత మంది మహిళలు వెలుగు ఏపిఎం జయమ్మ సూచన మేరకు వ్యాపారం నిమిత్తం బడ్డీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మండలంలో అతి ఎత్తైన ప్రాంతం నుండి జాలు వారే జలపాతమైన లొద్ద పట్ల జిల్లా కలెక్టర్ ఇప్పటికే దృష్టి సారించారు. గత ఆదివారం కలెక్టర్ ఎంతో వ్యయ ప్రయాసల కోర్చిఇప్పటి వరకు ఏ జిల్లా కలెక్టర్ చెయ్యని సాహసం చేసి, కొన్ని కిలోమీటర్లు కాలినడక “న జలపాతం వద్దకు వెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి పరవశించారు. వెంటనే అభివృద్ధికి శ్రీ కారం చుట్టాలని తమ అధికారులను ఆదేశించారు. దీనితో ఎప్పటి నుండో తాము ఎదురు చూస్తున్న తరుణం వచ్చిందని ఏజన్సీ వాసులు సంబర పడుతున్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే మండలంలోని పలు ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ది చెంది గిరిజన యువతకు ఉపాది కలుగుతుందని చెప్పక తప్పదు.

21-10-B

21-10-A

21-10-C