Issue of Caste Certificates Regarding
Publish Date : 18/10/2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకముగా చేపట్టిన సుమోటో కుల దృవపత్రముల జారీ విషయములో పార్వతీపురం మన్యం జిల్లాలో గల అన్ని మండలములకు సంబధించి వచ్చిన 1,99,593 అన్ని కులదృవపత్రములు పూర్తిగా వార్డు మరియు గ్రామ సచివాలయము పరిధిలో పూర్తి స్దాయి విచారణ చేపట్టి రాష్ట్రములోనే పార్వతీపురం మన్యం జిల్లా ఈ దృవపత్రముల జారీ విషయములో నేడు అగ్రగామిగా నిలిచిందని ఇందుకు సంబధించి సంబధిత అభ్యర్దులు సచివాలయ / రెవెన్యూ కార్యాలయమునకు వెళ్ళకుండా సుమోటోదృవపత్రములు జారీ చేయదలచిన ప్రభుత్వ దృక్పదమును అమలుకు కృషి చేసిన సబ్ కలెక్టర్, పార్వతీపురం, పాలకొండ మరియు జిల్లా లో గల అందరు తహశీల్దార్ లు మరియు గ్రామ మరియు వార్డు స్దాయి గ్రామ రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి గారు ఒక ప్రకటనలో ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు.

PVP181025