Dry day at Parvathipurammanyam District on 17/10/2025

dryday1

dryday2

dryday3
17-08-2025
*పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి*
*ఫ్రైడే డ్రైడే కార్యక్రమ ప్రాధాన్యతను వివరించాలి*
*జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి*
పార్వతీపురం, అక్టోబర్ 17 : పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ పట్ల చేపట్టవలసిన కార్యక్రమాలపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్,ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ఫ్రైడే డ్రైడే కార్యక్రమని, దీని ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. పార్వతీపురం మండలం డోకిశీలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను జేసీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ
జరిగిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. మురుగునీటి కాలువలు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి జేసీ పలు సూచనలు, మార్గదర్శకాలను జారీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిలిచి, దోమలు వృద్ధి చెందకుండా నివారించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడం ఫ్రైడే డ్రైడే లక్ష్యమని అన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాల్లోని నిల్వ ఉన్న నీటిని తొలగించి, ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచాలని సూచించారు. కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, ఇతర పనికిరాని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వివరించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి అని, దాన్ని విద్యార్థులు పాటించేలా అవగాహన కల్పించాలని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.