Yarlagadda Lakshmi Prasad, President of the State Official Language Association, asked the District Collector Nishant Kumar to work towards the implementation of Telugu percent as a Telugu language lover.
*అధికార భాషకు ప్రత్యేక గుర్తింపు తేవాలి*
పార్వతీపురం, సెప్టెంబర్ 15 : తెలుగు భాషాభిమానిగా తెలుగు శత శాతం అమలుకు కృషి చేయాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కోరారు. జిల్లా పర్యటనకు గురు వారం విచ్చేసిన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో అధికార భాష అమలుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. భాషాభిమానిగా అన్ని శాఖల ఉత్తర ప్రత్యుత్తరాలులో శత శాతం జారీ చేయుటకు, ప్రజల్లో అధికార భాషను పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. అధికార భాషను పూర్తి స్థాయిలో అమలుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.
అంతక ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను పాలనా భాషగా అమలుకు చర్యలు చేపట్టిందని అధ్యక్షులు తెలిపారు. తెలుగు భాషను అమలు చేయనివారికపై చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా ఒక నియమావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని ఆయన వివరించారు. నియమావళి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. మాతృ భాషపై మమకారం ఉండాలని, దానిని పరిరక్షించు కోవాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర గురజాడ, గిడుగు, రోణంకి తదితర గొప్ప పండితులకు నిలయమైన ఉత్తమ ఆంధ్రాగా అభివర్ణించారు. పి.వి. నరసింహా రావు, జలగం వెంగళరావు, ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ వంటి అప్పటి ముఖ్య మంత్రులు తెలుగు భాషకు కృషి చేశారని, ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు పాల్గొన్నారు.