Close

The District Joint Collector said that the applications received from the people in the response program should be thoroughly considered and resolved in full

Publish Date : 17/05/2022
The District Joint Collector said that the applications received from the people in the response program should be thoroughly considered and resolved in full

*అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి*

పార్వతీపురం మన్యం, మే 16: స్పందన కార్యక్రమం లో ప్రజల నుండి వచ్చే అర్జీలను సమగ్ర పరిశీలన చేసి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ అర్.కూర్మారావు, జిల్లా రెవెన్యూ అధికారి జలపల్లి వెంకట్రావు స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 103 వినతులు అందాయి. అధికంగా భూ సమస్య పరిష్కరించాలని, ఉపాధి కల్పించాలని, సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినతులు రీ ఓపెనింగ్ కాకుండా సమగ్ర పరిశీలన చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు.
గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని పాచిపెంట మండలం ఇటికవలస గ్రామానికి చెందిన కె. అప్పారావు వినతి సమర్పించారు. అన్ని అర్హతలు కలిగిన తనకు వైయస్సార్ ఆసరా పథకం వర్తింప చేయాలని గరుగుబిల్లి కి చెందిన ముగిది కాంచన కోరారు. గృహ నిర్మాణ.బిల్లుల బకాయిలను మంజూరు చేయాలని కొమరాడ మండలం మాదలింగ గ్రామానికి చెందిన హిమరక లక్ష్మి వినతిప్రాన్ని అందజేశారు. 22a నిషేధిత భూముల జాబితాలో తన జిరాయితి భూమి నమో దైనందున తొలగించాలని వీరఘట్టం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చప్పా జగన్నాథం కోరారు.
ఈ కార్యక్రమంలో లో డిఎంఅండ్ హెచ్ ఓ బి.జగన్నాథం, గిరిజన సంక్షేమ శాఖ డీ ఈఈ ఎమ్. తిరుపతి నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ప్రభాకర్ రావుతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.