The Chief Minister on Wednesday held a video conference with the District Collectors on the progress of work on the Employment Guarantee Scheme material component, housing, re-survey, response, agriculture etc.
*పనుల ప్రగతిపై సి.ఎం వీడియో కాన్ఫరెన్స్*
పార్వతీపురం, జూన్ 1 : ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ తో జరుగుతున్న పనులు, గృహ నిర్మాణాలు, రీ సర్వే, స్పందన, వ్యవసాయం తదితర అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సహాయ, పునరావాస కమీషనర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆర్. సుగుణాకర రావు, కార్యనిర్వాహణ ఇంజినీర్లు ఆర్. అప్పల నాయుడు, రామచంద్ర రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు.