State Panchayat Raj Commissioner Kona Shashidhar said that Swachha Sankalpa villages should be created. A video conference was held with the district collectors on Thursday.
*స్వచ్ఛ సంకల్ప గ్రామాలు ఆవిర్భవించాలి*
పార్వతీపురం, మే 12 : స్వచ్ఛ సంకల్ప గ్రామాలు ఆవిర్భావం కావాలని రాష్ట్ర పంచాయతి రాజ్ కమీషనర్ కోన శశిధర్ అన్నారు. జిల్లా కలెక్టర్ లతో గురు వారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం పై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ ఈ మేరకు శుక్ర, శని వారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. మండలంలో కనీసం ఒక గ్రామం ఆదర్శంగా తయారు కావాలని, క్రమంగా అన్ని గ్రామాలు స్వచ్చతకు నిలయాలు కావాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ బిల్లులు వెంటనే అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, ఆర్. డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, మహిళ శిశు సంక్షేమ అధికారి వరహాలు తదితరులు పాల్గొన్నారు.