Close

Special Principal Secretary of Education Department B. Rajasekhar has ordered that the building construction works sanctioned below should be done with 100% grounding.

Publish Date : 30/08/2022
Special Principal Secretary of Education Department B. Rajasekhar has ordered that the building construction works sanctioned below should be done with 100% grounding.

*శత శాతం పనులు గ్రౌండింగ్ కావాలి*

పార్వతీపురం, ఆగష్టు 25 : నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ సురేష్ కుమార్ తో కలసి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్డింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు. స్కూల్ నిర్వహణ నిధులతో పాటశాలల మరామత్తులను చేపట్టేందుకు వినియోగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నాడు నేడు క్రింద మంజూరైన పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ గౌరీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఓ.ప్రభాకర రావు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జె. శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.