* Launched mobile veterinary ambulances *
Publish Date : 23/05/2022
*ప్రారంభమైన సంచార పశు వైద్య అంబులెన్సులు*
పార్వతీపురం, మే 20 : జిల్లాకు సంచార పశు వైద్య అంబులెన్సులు చేరుకున్నాయి. నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ చొప్పున నాలుగు నియోజక వర్గాలకు వాహనాలు చేరుకున్నాయి. పార్వతీపురం నియోజక వర్గ అంబులెన్సును శుక్ర వారం ఐటిడిఏ కార్యాలయ ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ పరిశీలించారు. జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు అంబులెన్సు వివరాలు తెలిపారు.
ప్రభుత్వం పశువులకు మంచి వైద్య సేవలు అందించాలని సంకల్పించిందని, దానిని నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ ఆనంద్ అన్నారు. పశు వైద్య అధికారులు మంచి సేవలు అందించాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె వి ఎస్ యన్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.