Close

Joint Collector O. Anand said that district officials must attend the response program and warned that strict action will be taken against negligent officials.

Publish Date : 07/09/2022
Joint Collector O. Anand said that district officials must attend the response program and warned that strict action will be taken against negligent officials.

స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు
పార్వతీపురం, ఆగష్టు 29: సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు భావన ప్రజలనుండి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత జిల్లా అధికారులకు నేరుగా అందజేసి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని, ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్లక్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పందన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వినతులు అందజేసారు. 118 వినతులు అందాయి.
* కొమరాడ మండలం కొత్త కల్లి కోట గ్రామం సర్పంచ్ డి.మురళీకృష్ణ మరియు గ్రామస్తులు తోటపల్లి ప్రాజెక్ట్ వలన పంటలు ముంపుకు గురవుతున్నాయని అధికారులతో వాస్తవ పరిస్థితిని అంచిన వేసి ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహరం అందించాలని వినతి పత్రం సమర్పించారు.
* సాలూరు మండలం కుద్దాడ వలస గ్రామంలో ఆశ వర్కర్ లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామానికి ఆశా వర్కర్ నియమించాలని గ్రామ వాలంటీర్ మరియు శ్రీదేవి వినపత్రం అందజేశారు.
* బంటు వాని వలస గ్రామం పార్వతీపురం మండలం తోటపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు ఓలేటి గౌర్నాయుడు పునరావాస భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువకులకు వేరుగా ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
* రావు పల్లి గ్రామం గరుగుబిల్లి మండలానికి చెందిన జి.కురమయ్య దివ్యాంగుడు మూడు చక్రాల వాహనం ఇప్పించవలసిందిగా కోరారు.
* దేవుపల్లి గ్రామం బోండా పల్లి మండలం చెందిన డి.కృష్ణ ROFR పట్టాలు ఎస్టీ వాళ్లకి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమికి హద్దులు కేటాయించు నిమిత్తం సప్లయి చేసిన సర్వే స్టోన్స్ బకాయిలు ఐ.టి.డి.ఏ వారినుండి ఇప్పించవలసిందిగా కోరుతూ వినతిపత్రం అందించారు.
* బలిజిపేట మండలం వెంగళ రామపురం గ్రామం నకు చెందిన గుంపు సత్యనారాయణ మరియు గ్రామస్తులు వెంగళరామపురం రెవెన్యూ పరిధిలో ఉన్న భూమి కి రైతు వారి పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతూ కోరారు.
* పార్వతీపురం పట్నానికి చెందిన గౌరీ శంకర్రావు వెంకంపేట గ్రామంలో ఖాతా నెంబర్ 81 సర్వేనెంబర్ 22.2 య.0.20 సెంట్లు స్థలం ఆక్రమణ కారణంగా సర్వే చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
* సీతానగరం మండలం గాదలవలస గ్రామంనకు చెందిన ఏ.మంగమ్మ వైయస్సార్ చేయూత పథకానికి అర్హురాలినని, కాని అనర్హురాలనని చూపిస్తున్నారని, కావున ఎంక్వయిరీ చేసి వైయస్సార్ చేయూత పథకం మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు.
* పార్వతిపురం మండలం తాళ్ల బురిడీ గ్రామానికి చెందిన బి.కుమారి నా యొక్క భూమి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయలేని కారణంగా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు రావడం లేదని భూమిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
* బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన టీ.తవిటి నాయుడు గత రెండు సంవత్సరాలుగా రేషన్ కార్డ్ కొరకు తిరుగుతున్నానని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏమి రావడం లేదని కొత్త రేషన్ కార్డు యిప్పించవలసినదిగా దరఖాస్తు చేసుకున్నారు.
* గరుగుబిల్లి మండలం కర్రివలస గ్రామం చెందిన రేగిడి లక్ష్మి గత రెండు సంవత్సరాలుగా వితంతు పెన్షన్ ఆగిపోయిందని మరల వితంతు పెన్షన్ పునరుద్దరించవలసినదిగా వినతిపత్రం అందజేసారు.