Close

Joint Collector O. Anand said that children’s entertainment programs are being arranged during Dussehra celebrations on the 3rd of Parvathipuram Government Junior College grounds.

Publish Date : 01/10/2022
Joint Collector O. Anand said that children's entertainment programs are being arranged during Dussehra celebrations on the 3rd of Parvathipuram Government Junior College grounds.

*ఉత్సవాలలో చిన్నారుల వినోద కార్యక్రమాలు*

పార్వతీపురం, అక్టోబరు 1 : పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ తేదీన నిర్వహేంచే దసరా ఉత్సవాలలో చిన్నారుల వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. దసరా ఉత్సవాల నిర్వహణపై శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఉత్సవాలు సోమ వారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. చిన్నారుల వినోద కార్యక్రమాలు, చేనేత, ఇతర సామగ్రి ప్రదర్శన, విక్రయాలు, తినుబండారాల ప్రదర్శన, ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణా సంచా కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు.

కార్యక్రమాల వివరాలు :

*చిన్నారుల వినోద కార్యక్రమాలు* : బంగీ రన్నింగ్, ఆర్చెరి, డార్ట్ గేమ్, గన్ షాట్, బాల్ పూల్, ట్రంపోలైన్, స్లైడింగ్ బౌన్స్ వంటి ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు.

*ప్రదర్శనలు* : మహిళలకు ఆసక్తి కలిగించే చేనేత వస్త్ర ప్రదర్శన ఉంటుందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ప్రదర్శనలలో నారాయణపురం, బొబ్బిలి, పొందూరు, సీతంపేట, పార్వతీపురం వన్ ధన్ కేంద్రం, జిసిసి అటవీ తదితర ఉత్పత్తులు, చినబరంపురం వెదురు సామగ్రి, సవర కళాకృతులు, జౌళి (జ్యూట్) బ్యాగులు, అటవీ – ఉద్యానవన నర్సరీలు, మొక్కలు, బ్రహ్మకుమారీ సంస్ధ రాజ యోగా ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

*సాంస్కృతిక కార్యక్రమాలు* : ఢీ – రంగం – ఆటా బృందం ఫేం రాజేశ్వరి నృత్యాలు, జబర్దస్త్ టీం సభ్యులు రాజమౌళి, తన్మయి, గెడ్డం నవీన్ ల స్కిట్ లు, వినోద కార్యక్రమాలు

జట్టు ఆశ్రమ ప్రఖ్యాతి చెందిన శాస్త్రీయ నృత్యం, జానపద కళారూపాలు, జాతీయ స్ధాయిలో ప్రదర్శనలు ఇచ్చిన బిందెల (మరకాలు నృత్యం) నృత్యం, ధింసా నృత్యం, తప్పెట గుళ్ళు, కోలాటంతోపాటు ఫ్యాషన్ షో కార్యక్రమాలు అలరించ నున్నాయి.

*ఆహార పానీయాలు – తినుబండారాలు* :
పానీపూరి, ఛాట్, పావ్ బాజీ, నూడిల్స్, రోల్స్ , సమోసా, మసాల వడ, పకోడి, బజ్జీ తదితర నోరూరించే తిను బండారాలు

చివరగా *బాణాసంచాలతో* ఆద్యంతం ఆసక్తికరంగా ఆనందంగా ఉత్సాహంగా సాగనుంది.
అన్ని శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జల్లెపల్లి వెంటక రావు, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ కె.రామచంద్ర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ వై.సత్యం నాయుడు, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, సీతంపేట ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి రోసి రెడ్డి, పార్వతీపురం ఐటిడిఏ సహాయ అకౌంట్స్ అధికారి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాధ రావు, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ, సీతంపేట ఐటిడిఏ డిపిఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.