Jagananna Sports Club App was unveiled by District Collector Nishant Kumar on Monday.
*జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ఆవిష్కరణ*
పార్వతిపురం, సెప్టెంబర్ 12 : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో యాప్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ద్వారా క్రీడాకారులు తమ సమాచారాన్ని అందించి క్లబ్ లో చేరవచ్చని అన్నారు. యాప్ ద్వారా సమాచారం అందించడం వలన క్రీడాకారులకు ప్రభుత్వం నుండి మరింత ప్రోత్సాహకాలు అందించడానికి తోడ్పడుతుందని ఆయన చెప్పారు. క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు యాప్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. క్రీడాకారులందరూ తమ సమాచారాన్ని యాప్ లో పొందుపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకట్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు, జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు డి.టి.గాంధీ, మురళి కృష్ణ, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.