Close

Dussehra celebrations were held grandly in district center Parvathipuram. Angaranga Vaibhogana Asantham was celebrated with gaiety and enthusiasm in the grounds of the Government Junior College.

Publish Date : 04/10/2022
Dussehra celebrations were held grandly in district center Parvathipuram. Angaranga Vaibhogana Asantham was celebrated with gaiety and enthusiasm in the grounds of the Government Junior College.

*ఉల్లాసంగా దసరా ఉత్సవాలు*

పార్వతీపురం, అక్టోబర్ 3 : జిల్లా కేంద్రం పార్వతీపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంగరంగ వైభోగంగా ఆసాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి. ఉత్సవాలు సోమ వారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వినోదాత్మకంగా సాగాయి. జానపద కళారూపాలు ధింసా నృత్యం, తప్పెట గుళ్ళు కోలాటంతో పాటు, ఢీ – రంగం – ఆటా బృందం ఫేం రాజేశ్వరి బృందం లోటస్ డాన్స్, ఫెదర్ డాన్స్, జట్టు సంస్థ శాస్త్రీయ నృత్యాలు, జబర్దస్త్ టీం సభ్యులు రాజమౌళి, తన్మయి, గెడ్డం నవీన్ ల వినోద కార్యక్రమాలు, ఆంధ్ర, రాజస్థాన్, కేరళ తదితర వస్త్ర ధారణ ఫ్యాషన్ షో కార్యక్రమాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఉత్సవాలలో చిన్నారుల వినోద కార్యక్రమాలు – బంగీ రన్నింగ్, ఆర్చెరి, డార్ట్ గేమ్, గన్ షాట్, బాల్ పూల్, ట్రంపోలైన్, స్లైడింగ్ బౌన్స్ ఏర్పాటుతో చిన్నారుల కేరింతలతో నిండాయి.

నారాయణపురం చేనేత వస్త్ర ప్రదర్శన, పొందూరు ఖాది వస్త్ర ప్రదర్శన, ఐటీడీఏ పరిధిలోని వి డి వి కె ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయశాల, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన, వెలుగు విభాగం ఏర్పాటు చేసిన చెక్క బొమ్మలు, వెదురు బొమ్మలు, సీతంపేట ఐటిడిఏ వారి ఆధ్వర్యంలో సవర ఆర్ట్స్ ప్రదర్శన, మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ఉత్పత్తులు, గోగునారు ఉత్పత్తులు, ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన నర్సరీ, రుచికరమైన తినుబండారాలు, ఆహార పానీయాలు ఆకర్షించాయి. పార్వతీపురం పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు. జిల్లాగా ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో ప్రజలు హర్షద్వానాలు చేశారు.

డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు అలజంగి జోగారావు, మునిసిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్పిటిసి బలగ రేవతమ్మ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూ కొత్త జిల్లాలో దసరా ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ప్రజలు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందని, జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేద్దాం అని పిలుపు నిచ్చారు.
: జెడ్ పి చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస్ మాట్లాడతూ మంచి పై విజయం సాధించడంమే విజయ దశమి పండుగ అని, ప్రజలు అన్ని విధాలా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక రంగంతోపాటు అన్ని రంగాల్లో మిగతా జిల్లాలకు ధీటుగా జిల్లా అభివృద్ధి బాటలో పయనించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు.