Dr. from the district in Kadapa. Y. S. R. District Collector Nishant Kumar congratulated the four students who were selected for the State Sports School.
Publish Date : 26/09/2022
రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపికైన విద్యార్దినులను అబినందించిన
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
పార్వతీపురం, సెప్టెంబర్ 22: జిల్లా నుండి కడపలో గల డా. వై. ఎస్. ఆర్. రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపికైన నలుగురు విద్యార్దినులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అబినందించారు. క్రీడలలో మంచి ప్రతిభ కనపరచి పతకాలు సాదించాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొనేలా కష్టపడాలన్నారు. పతకాలు సాదించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవాలన్నారు.
జిల్లా నుండి తోమ్మిది మంది క్రీడాకారులు గుంటూరులో జరిగిన ఎంపిక కార్యక్రమానికి వెళ్ళగా నలుగురు ఎంపికయ్యారని జిల్లా చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. పాలకొండకు చెందిన చింత కావ్యశ్రీ, పాండ్రంగి అక్షయ , మక్కువ మండలం బంగారువలస గ్రామానికి చెందిన షేక్ రషిత, మత్స జాస్మిని ఎంపికైనట్లు తెలిపారు.