Close

District level YSR set up at the premises of Salur Agricultural Market Committee. District Collector Nishant Kumar,Deputy Chief Minister of the state and Tribal Welfare Minister Peedika Rajannadora were the chief guests at the farmers’ distribution program.

Publish Date : 17/05/2022
District level YSR set up at the premises of Salur Agricultural Market Committee. District Collector Nishant Kumar,Deputy Chief Minister of the state and Tribal Welfare Minister Peedika Rajannadora were the chief guests at the farmers' distribution program.

*వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం నిధులు విడుదల*

*వరుసగా నాలుగో ఏడాది 2022-23 సం.లో రైతులకు మొదటి విడత ఆర్ధిక సహాయం*

*జిల్లావ్యాప్తంగా 1,34,939 మంది రైతు కుంటుంబాలకు రూ. 78.01 కోట్లు నిధులు జమ *

*మీట‌నొక్కి 3758 కోట్ల రూపాయలు విడుద‌ల చేసిన ముఖ్య‌మంత్రి జగన్ మోహన్ రెడ్డి *

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖమాత్యులు పీడిక రాజన్నదొర

సాలూరు, మే 16 : సోమవారం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వై.ఎస్‌.ఆర్‌. రైతుభ‌రోసా పంపిణీకార్యక్రమం నకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖమాత్యులు పీడిక రాజన్నదొర ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం వై.ఎస్‌.ఆర్‌.రైతుభ‌రోసా – పి.ఎం.కిసాన్ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు, అట‌వీ భూముల సాగుదారుల‌కు ఇస్తున్న నాల్గవ విడ‌త ఆర్ధిక స‌హాయాన్ని ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం ఏలూరు జిల్లా గణపవరం గ్రామంలో మీట‌నొక్కి విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.
పార్వతీపురం నియోజకవర్గం లో మంది రైతులకు 15.56 కోట్లు రూపాయలు, సాలూరు నియోజకవర్గం లో 25171 మంది రైతులకు 14.99 కోట్ల రూపాయలు, కురుపాం నియోజకవర్గం లోని 42455 మంది రైతులకు 25.13 కోట్ల రూపాయలు, పాలకొండ నియోజకవర్గంలోని 39236 మంది రైతులకు 22.32:కోట్ల రూపాయలు చొప్పున
జిల్లాలోని 1,34,949 మంది రైతులు, కౌలు రైతులు, అట‌వీభూముల సాగుదారుల‌కు 2022 – 23 సంవ‌త్స‌రానికి నాల్గవ విడ‌త స‌హాయం కింద రూ.78.01 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం క్రింద వరుసగా నాలుగో ఏడాది కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని తొలివిడగా రైతులకు 5,500, ఆర్ ఓ ఆర్ పట్టాదారులకు 7,500 రూపాయలు చొప్పున జమ చేయడం జరిగిందని, రెండో విడతగా 4 వేల రూపాయలు అక్టోబర్ నెలలోనూ, మూడో విడతగా జనవరి నెలలో రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. ఆర్ ఒ ఆర్ పట్టాదారు లకు పీఎం కిసాన్ వర్తించదని అందువల్ల దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మూడు లక్షల మంది గిరిజనులకు ఆర్ఓఆర్ పట్టాలు అందించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చెందుతుందన్నారు. మన రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట కల్పవృక్ష అని, వారికి కావాల్సిన సమస్యలు వాటి ద్వారా జరుగుతున్నాయన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో రైతులకు కల్పిస్తున్న సేవలు అందించడం లేదన్నారు.
అర్హత ప్రామాణికంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా, నిష్పక్షపాతంగా, పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు 50 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందించి, వారి నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో సేవలందిస్తున్న వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నరీ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు అనే భావన వదిలి రైతు కుటుంబ సభ్యులుగా పనిచేయాలన్నారు. గత 3 సంవత్సరాలుగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా రబీ, ఖరీఫ్, పంట కోత సమయంలో రైతులకు 13,500 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలివిడతగా జిల్లాలో సుమారు 78 కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలను విత్తనం నుండి పంట కొనుగోలు వరకు వన్ స్టాప్ షాప్ సేవలు అందిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న విత్తనాలు మూడు స్థాయిలలో తనిఖీ చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చరల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారని, దాని ద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ ట్రైనింగ్ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆసిని తుఫాన్ సమయంలో ఆర్బి కె ద్వారా రైతులకు అప్రమత్తం చేసి నష్టం తగ్గించగలిగామన్నారు. రైతుల సేవలు అందించడంలో ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వహించినా, లంచాలు ఆశించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో పొలంబడి, తదితర వ్యవసాయ కార్యక్రమాలకు సర్పంచ్ ను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.
శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల మూలంగా ఇబ్బందులు పడుతున్న రైతులను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ కంటే ఎక్కువగా రైతులకు సహాయం చేస్తున్నారన్నారు. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను స్ధాపించి విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ రైతన్నలకు కొండంత అండగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వ్యవసాయ సంక్షేమ రంగాల్లో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచినదన్నారు.
రైతులు సామంతుల కృష్ణ, వందల శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా డబ్బులతో విత్తనాలు ఎరువుల కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడి ఇబ్బంది పడకుండా ఆదుకుంటుందని, ఆర్థిక ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన అన్ని సేవలు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్ జిల్లా వ్యవసాయ శాఖల ప్రగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.