Close

District Collector Nishanth Kumar inspected Amrit Sarovar works in Sitanagar, Balijipet and Parvathipuram mandals.

Publish Date : 06/08/2022
District Collector Nishanth Kumar inspected Amrit Sarovar works in Sitanagar, Balijipet and Parvathipuram mandals.

అమృత్ సరోవర్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాల్లో పరిశీలించారు. సీతానగరం మండలం జారుముల్లవలస, బలిజిపేట మండలం బర్లి, పార్వతీపురం మండలం ఎం.ఆర్.నగర్ లో పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతం పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలని ఆదేశించారు. గ్రామస్తులు ఇందులో భాగస్వాములై ప్రతి నిత్యం సుందరంగా ఉండేందుకు సహాయపడాలని ఆయన పేర్కొన్నారు. గ్రామస్తులు అమృత్ సరోవర్ వినియోగదారుల సభ్యులుగా ఏర్పడి శారీరక, మానసిక ప్రశాంతతకు నిలయంగా మార్చాలని చెప్పారు. ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ చేయుటకు, యోగా సాధనకు, చిన్ననాటి స్నేహితులు కూర్చుని ఆనందంగా మాటలు చెప్పుకొనుటకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటకు చక్కని వేదికగా తయారు చేయాలని సూచించారు. దాతల సహకారం తీసుకుని కూర్చొనుటకు వీలుగా బల్లలు ఏర్పాటు చేయడం వల్ల సాయంత్రం పూట ప్రశాంత వాతావరణంలో కొద్ది సేపు గడిపే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఆగష్టు 15న జెండా వందనం చేయాలని ఆయన కోరారు. ఉగాది, వన భోజన కార్యక్రమాలు, ఇతర వేడుకలు నిర్వహించుటకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. గ్రామంలో చక్కని ప్రదేశం ఆవిష్కృతం అవుతుందని, దానిని గ్రామస్తులు శ్రద్ధతో పరిరక్షించుకోవాలని ఆయన చెప్పారు.

*పింఛను సమస్యకు పరిష్కారం*

జారుముల్లవలస గ్రామంలో తనకు పింఛను రావడం లేదని ఒక మహిళ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించారు. వివరాలు అక్కడికక్కడే కనుక్కుని ఆగిన పింఛను వచ్చే ఏర్పాట్లు చేశారు. సమస్య పరిష్కారం జరిగినందుకు ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.