Close

District Collector Nishanth Kumar has called for bringing the brilliance of ‘Andhra Kesari’ Tanguturi Prakasam who sacrificed his life for the country as an example.

Publish Date : 24/08/2022
District Collector Nishanth Kumar has called for bringing the brilliance of 'Andhra Kesari' Tanguturi Prakasam who sacrificed his life for the country as an example.

*టంగుటూరి ప్రకాశం జీవితం ఆదర్శం*

పార్వతిపురం, ఆగష్టు 23: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశంను ఆదర్శంగా తీసుకావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్యలన చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించిన టంగుటూరి ప్రకాశం సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అన్నారు. కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో న్యాయవాది వృత్తిని ప్రారంభించి, అచిర కాలంలోనే మంచి పేరు సంపాదించి చిన్న వయస్సులోనే రాజమహేంద్రవరానికి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని సంపాదన అంతా ఖర్చుచేశారని, 1942లో మూడేళ్లు కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారని, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆంగ్లేయుల తుపాకులకు గుండె ఎదురొడ్డి “ఆంధ్ర కేసరి “ గా పేరు పొందారన్నారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీ కి జరిగిన ఎన్నికలలో ప్రకాశం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు , పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణం తరువాత 1953 అక్టోబర్ లో యేర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కి , అణగారిన వర్గాల అభివృద్ధి కి కృషి చేశారని తెలిపారు. దేశం కొరకు , రాష్ట్రం కొరకు , ప్రజల అభివృద్ధి కి జీవితాన్ని త్యాగం చేసిన వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. సామాజిక దృక్పథంతో బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. న్యాయవాదిగా, నటులుగా, రాజకీయ నాయకులుగా, పాత్రికేయులుగా, స్వాతంత్రోద్యమ కర్తగా విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన టంగుటూరిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని, సమాజ హితం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, , జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కార్యాలయం పాలనాధికారి ఆర్.ఉమామహేశ్వర రావు, సిబ్బంది సునీత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.