District Collector Nishant Kumar told district officials that the district needs to meet the set targets
అబివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం, మే 19: ప్రభుత్వం అమలు చేస్తున్న అబివృద్ధి, సంక్షేమ పధకాలను పక్కాగా పర్యవేక్షణ చేయాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన, హోసింగ్ మొదలగు అంశాలపై సమీక్షనిర్వహించారు.
సమీక్షానంతరం జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు గల లే అవుట్ లలో అన్ని స్థలాలలో గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ నాడు-నేడు పనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ , (నాడు నేడు ) వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు పనులు పురోగతి గురించి తెలుసుకొని నిర్మాణాలకు కావలసిన సిమెంట్, యిసుక, ఇనుము తదితర మెటీరియల్ పై సమగ్ర నివేదిక అందజేయాలని అదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఒ. ఆనంద్, డిఆర్వో వెంకట్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.