Close

District Collector Nishant Kumar said that the national awards were possible with the collective efforts of the district administration.

Publish Date : 04/10/2022
District Collector Nishant Kumar said that the national awards were possible with the collective efforts of the district administration.

*సమష్టి కృషితో జాతీయ అవార్డులు*

పార్వతీపురం, అక్టోబర్ 4 : జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో జాతీయ అవార్డులు సాధ్యమైందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కారం, స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు జిల్లాకు రావటం పట్ల జిల్లా అధికారుల సంఘం, రెవిన్యూ ఉద్యోగుల సంఘం, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను మంగళ వారం సత్కరించి అభినందించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లాలో జిల్లా అధికారులు పాజిటివ్ గా పని చేస్తున్నారని ప్రశంసించారు. అధికారులు బాగా పని చేయడం వలన మిగిలిన జిల్లాలతో ఎక్కడా తీసిపోని స్థాయిలో ఉన్నామని చెప్పారు. ఇదే ఉత్సాహం, స్ఫూర్తి కొనసాగించి మరింత ప్రగతి దిశగా అడుగు వేయాలని జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు జిల్లా సాధించి ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (sustainable Development Goals) సాధించాలని ఆయన సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని, ఆరోగ్య రంగంలో దృష్టి సారించి స్ప్రేయింగ్, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య అంశాలపై చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ఒక గొప్ప అవకాశం అని, ప్రజా సేవకు, వినూత్న కార్యక్రమాలు చేపట్టుటకు మంచి అవకాశం అని ఉద్బోధించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాతృ శిశు మరణాల నివారణ, అక్షరాస్యత పెంపు, గ్రామీణ పేదరిక నిర్మూలన వంటి లక్ష్యాల కోసం పని చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, జిల్లా అధికారులు ఎం.వి.జి.కృష్ణా జి, లోచర్ల రమేష్, ఉరిటి మహేంద్ర, బలివాడ సత్యనారాయణ, ఓ. ప్రభాకర రావు, పి.సీతారాం, వీర్రాజు, సూర్యనారాణ, వై.సత్యం నాయుడు, పి.బ్రహ్మాజీ రావు, ఎం.కిరణ్ కుమార్, కలక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి ఆర్ ఉమామహేశ్వర రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.