District Collector Nishant Kumar said that the money received through the YSR scheme should be invested and self-employed.
పత్రికా ప్రకటన
జిల్లాలో 75,290 మంది మహిళా లబ్ధిదారులకు
రూ.141.16 కోట్లు వై.యస్.ఆర్ చేయూత
పార్వతీపురం, సెప్టెంబరు 23 : వై.యస్.ఆర్ చేయూత పధకం ద్వారా వచ్చిన డబ్బులను పెట్టుబడి గా పెట్టి స్వయం ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం గిరిమిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వై.యస్.ఆర్ చేయూత పధకం కార్యక్రమం లో శాసనసభ్యులు అలజంగి జోగారావుతో కలిసి లబ్దిదారులకు చెక్కును అందజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఉత్పాదకశక్తి కలిగిన 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలలకు చేయూత నందించుట ద్వారా కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని డబ్బులు అందించుట జరుగుతుందని, డబ్బులతో పెట్టుబడిగా వ్యాపారం లేదా స్వయంఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు.
శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ వై.యస్.ఆర్ చేయూత పధకం క్రింద జిల్లాలో మూడు సంవత్సరాలలో 75,290 మందికి రూ.141.16 కోట్లు ఆర్ధిక సహాయం అందించినట్లు తెలిపారు. మహిళల సమగ్ర అభివృద్ధి ఎజెండా మరియు ఆర్థిక సాధికారతలో భాగంగా నవరత్నాలలో “వై.యస్.ఆర్ చేయూత” పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల బి.సి, యస్.సి, యస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు నాలుగు దఫాలలో రూ.75000/- ఆర్థిక సహాయం అందించే సంక్షేమ కార్యక్రమమే “వై.యస్.ఆర్ చేయూత” అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పంలో శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కడం ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా మొత్తాలు జమ అవుతుందని వివరించారు. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద ప్రభుత్వం రిటైల్, వస్త్ర వ్యాపారంలో గుర్తించిన లబ్ధిదారులకు అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్, ప్రాక్టర్ అండ్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన వివరించారు. పాడి రైతులకు పశువుల పెంపకం, పాల సేకరణ, ఆరోగ్య సేవలు, కిరాణా షాపులు, బట్టల షాపులు ఏర్పాటు, పండ్లు, కూరగాయలు, చిన్న జీవాలు కొనుగోలు కొరకు ఒప్పందాలు, ఆర్ధిక సహాయం చేయడం ద్వారా చిన్న మద్య తరహ వ్యాపారాలు నడుపుకోవడానికి లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోనేందుకు అవకాశం కల్పించటం జరుగుతుందని ఆయన చెప్పారు.
వై.యస్.ఆర్ చేయూత క్రింద మొదటి విడతలో 61,489లబ్ధిదారులకు రూ.115.29 కోట్లు, రెండవ విడత లో 64,433 లబ్దిదారులకు రూ.120.80 కోట్లు, మూడవవిడతలో శుక్రవారం 75,290 లబ్దిదారులకు రూ.141.16 కోట్లు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మజ్జి గౌరమ్మ, జెడ్.పి.టి.సి. సభ్యులు బలగ రేవతమ్మ, రాష్ట్ర ఎస్.సి.కమిషన్ సభ్యురాలు సవరాపు జయమణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ వై.సత్యం నాయుడు, లబ్దిదారులు పాల్గొన్నారు.