Close

District Collector Nishant Kumar said that success is possible only with continuous effort and hard work.

Publish Date : 26/09/2022
District Collector Nishant Kumar said that success is possible only with continuous effort and hard work.

నిరంతర ప్రయత్నం తోనే విజయం
పార్వతీపురం, సెప్టెంబరు 16: నిరంతర ప్రయత్నం, శ్రమ తోనే విజయం సాధ్యమని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాలో పదమూడు కంపెనీలలో సుమారు ఏడువందల తొంబదిఅయిదు వివిధ రకాల ఉద్యోగాలకు ఈరోజు ఇంటర్యూలు నిర్వహిస్తుండగా పదహేను వందలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం వస్తుందని, మిగిలిన వారు నిరుత్సాహపడకుండా మరల ప్రయత్నం చేయాలన్నారు. కార్యసాధనలో నిరతరం ప్రయత్నం చేయాలని, కష్టపడితే విజయం సొంతమవుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందుటకు వారికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కల్పించుటకు రాష్ట్రంలో 65 నియోజకవర్గాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చెస్తున్నట్లు తెలిపారు. కంపెనీలతో అవగాహన ఏర్పాటుచేసుకొని వారికి వారి కంపెనీలలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగఅవకాశాలు కల్పించటం ఈ హబ్ ల యొక్క ఉద్దేశ్యమని తెలిపారు.
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నిబద్దత, నిజాయతీతో పనిచేసి మంచి స్థాయికి చేరాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో యిబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. చాలామంది ప్రముఖులు వారి జీవితాలను చిన్నస్థాయినుంచే ప్రారంభించారని గుర్తుచేసారు. జాబ్ మేళాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ కంపెనీలు వస్తే మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో సైనప్టిక్ కంపెనీలో ట్రైనింగు కెమిస్ట్ గా ఉద్యోగాలు పొందిన గుమ్మలక్ష్మీపురం కడెమి కొత్తగూడకు చెందిన బి.ఎస్.సి. చదివిన బిడ్డిగ సురేష్, కొమరాడమండలం కోదులగొండ గ్రామానికి చెందిన ఇంటర్మీడియెట్ చదివిన మోసూరు రాజశేఖర్ లకు నియామకపత్రాలు అందజేసారు.
జిల్లా నైపుణ్య అభివృద్ది అధికారి యు.సాయి కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాలు నిరంతరం నిర్వహిస్తామని, ఎక్కువ మంది యువతకు ఉద్యోగ అవకాశశాలు కల్పించుటకు కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు ఎక్కువకంపెనీలు వచ్చేటట్లు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్శన్ గౌరీశ్వరి, వైస్ చైర్ పర్శన్ రుక్మిణి, , జిల్లా ఎంప్లాయివెుంటు అధికారి అరుణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు యితర అధికారులు హాజరైనారు.