Close

District Collector Nishant Kumar said efforts should be made to improve medical services in the district.

Publish Date : 23/05/2022
District Collector Nishant Kumar said efforts should be made to improve medical services in the district.

*వైద్య సేవల మెరుగుదలకు కృషి చేయాలి*

పార్వతీపురం, మే 20 : జిల్లాలో వైద్య సేవల మెరుగుదలకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ సోసైటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా స్ప్రేయింగ్ ను గ్రామ స్థాయిలో పంచాయతీ పంచాయతీ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల పరిషత్ అధికారులు, వెలుగు అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికట్టుటకు స్ప్రేయింగ్ పక్కాగా జరగాలని ఆయన తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ సోసైటీ రిజిస్ట్రేషన్ చేయించాలని, బ్యాంక్ ఖాతా తెరవాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ సోసైటీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవల పరిరక్షణ బాగా జరగాలని ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లాలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ సోసైటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. సోసైటి ఏర్పాటు మూలంగా గ్రామీణ ప్రాంతాల పారుశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ చర్యలకు ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. తద్వారా ఆరోగ్య కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాలలో మరింత పటిష్టంగా చేపట్టుటకు అవాశముందన్నారు.

జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, డిఆర్డిఎ పిడి సత్యం నాయుడు, జిల్లా పంచాయతి అధికారి కిరణ్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ అనిల్, జిల్లా పరిషత్ ఏఓ కె.అక్కారావు తదితరులు పాల్గొన్నారు.