District Collector Nishant Kumar ordered to speed up the process of YSR Jagananna Permanent Land Rights and Land Protection Scheme (Re Survey). The District Collector inspected the re survey process in Palakonda mandal on Saturday evening.
*రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి*
పార్వతీపురం, జూలై 30 : వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం (రీ సర్వే) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.పాలకొండ మండలంలో రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ శని వారం సాయంత్రం తనిఖీ చేశారు. భూములను పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరుగుతుందని తద్వారా భూ యజమానులకు తప్పులు లేని భూ పత్రాలు లభిస్తాయని చెప్పారు. భూ యజమానులు, రైతులు పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రక్రియ మరింత వేగవంతం చేయవచ్చని అన్నారు. రీ సర్వే చేయుటకు ముందు గ్రామ ప్రజలకు దండోరా ద్వారా సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. సర్వే చేసే పద్ధతులు, సర్వే షెడ్యూలు, సర్వే ప్రక్రియ, సర్వే వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి, ప్రజల సహకారాన్ని కోరాలని ఆయన స్పష్టం చేశారు. ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడం వలన రికార్డులు అప్డేట్ చేయడం జరుగుతుందని, దీనివలన భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా భూ లావాదేవీలు జరుపుకోగలరని లేదా క్రయవిక్రయాల సమయంలో సమస్యలు ఎదురు కావని అయన అన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు సురక్ష పథకం కింద ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే జరుగుతుందని ఆయన అన్నారు. డ్రోన్ల ద్వారా సర్వే చేపట్టడం జరుగుతుందని తద్వారా ఖచ్చితమైన సర్వే వివరాలు నమోదు అవుతుందని ఆయన చెప్పారు.
*భూముల వివరాలు అందించాలి*
ప్రజలు రీ సర్వే జరిగే సమయంలో తమ భూములకు సంబంధించిన వివరాలు అందించాలని కలెక్టర్ కోరారు. తమ భూమి కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, భవన అనుమతి పత్రాలు, వ్యక్తిగత లేదా జాయింట్ ఆస్తికి సంబంధించి భూ యాజమాన్య పత్రాలు, ఇంటి పన్ను చెల్లింపు రసీదులు, వీలునామా తదితర పత్రాలు చూపించాలని చెప్పారు. సర్వే ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం వహించాలని తద్వారా తమ భూములకు సంబంధించిన హద్దులు తెలుసుకోవచ్చని అన్నారు. నవీకరించిన పత్రాలు తయారు చేసి రెవెన్యూ అధికారులు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.
*వార్డు సచివాలయం తనిఖీ*
పాలకొండ మునిసిపాలిటీ పరిధిలో వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మునిసిపాలిటీ, సచివాలయం పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను , వాటి అనుమతులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఫీవర్ కేసులు పరిశీలించాలని, డెంగ్యూ, మలేరియా కేసులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రభల కుండా ప్రజలను పూర్తి అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, మునిసిపల్ కమీషనర్ ఎన్.రామారావు, తహశీల్దార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.