District Collector Nishant Kumar ordered that the problems of rehabilitation of Sardar Gauthu Lacchanna Thotapalli barrage should be resolved.
*పునరావాస కాలనీల సమస్య పరిష్కారం కావాలి*
పార్వతీపురం, సెప్టెంబర్ 9 : సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజి పునరావాస సమస్యలు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. పునరావాస కాలనీలు, ఇతర మౌళిక సదుపాయాలపై సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శుక్ర వారం సమీక్షించారు. పునరావాస కాలనీల్లో పూర్తి స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించి వరద ముంపు గ్రామాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు. బాసంగి, గిజబ, ఇంటివానివలస తదితర ప్రాంతాల్లో అధిక వర్షాల సమయంలో గ్రామాల్లో సమస్యలు తలెత్తరాదని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామాల్లో పూర్తిగా మౌళిక సదుపాయాలు కల్పించి పాత గ్రామాలలో ఎవరూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. పాత గ్రామాలు డీ నోటిఫై చేయాలని ఆయన సూచించారు. పునరావాస గ్రామాల్లో పాఠశాల భవనాలు, గృహాల నిర్మాణాలు పెండింగులో ఉంటే త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలకు వచ్చే యూనిట్ ఖరీదు ఇతర అంశాలను స్పష్టంగా వివరించి, ప్రజలను చైతన్య పరచాలని ఆయన ఆదేశించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని అందుకు సంబంధిత శాఖలు పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారి ఎం.జేమ్స్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, ఇపిడిసిఎల్ డిఇ కె. వెంకట రత్నం, రెవిన్యూ, గృహ నిర్మాణ సంస్థ,ఆర్.డబ్ల్యు.ఎస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.