Close

District Collector Nishant Kumar on Friday conducted a surprise inspection of 8,9 ward secretariats under Parvathipuram municipality.

Publish Date : 13/05/2022
District Collector Nishant Kumar on Friday conducted a surprise inspection of 8,9 ward secretariats under Parvathipuram municipality.

*సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్*

పార్వతీపురం, మే 13 : పార్వతిపురం పురపాలక సంఘం పరిధిలో 8,9 వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల్లో సిబ్బంది పనితీరును పరిశీలించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల డాష్ బోర్డు, సచివాలయాల పరిస్థితులను గమనించారు. సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. సచివాలయాలకు ప్రజలు నేరుగా వచ్చి ప్రభుత్వ పథకాలను గూర్చి అడిగినప్పుడు వాటిని విపులంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది హాజరు పక్కాగా ఉండాలని, బయోమెట్రిక్ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాల నిర్వహణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉండాలని ఆయన ఆదేశించారు. సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల సమాచారం అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా సామాజిక తనిఖీ పక్కాగా జరగాలని, అర్హులైన లబ్ధిదారులు తప్పిపోవడానికి అవకాశం ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందని, వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించిందని ఆయన తెలిపారు. సిబ్బంది ప్రజలకు సరైన సేవలు సకాలంలో అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అంకితభావంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల నుంచి వారి సమస్యలపై అందిన అర్జీలు వెంట వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ పొగిరి సింహాచలం సచివాలయ వ్యవస్థ నిర్వహణ గూర్చి వివరించారు. సచివాలయ సిబ్బంది తాము అందిస్తున్న సేవలను వివరించారు.