District Collector Nishant Kumar has directed the officials to take preventive measures at the places where road accidents are happening in the district.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
పార్వతీపురం, సెప్టెంబర్ 30: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుచున్న ప్రదేశాలలో నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశo నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రమాద ప్రదేశాలుగా గుర్తించిన ఆరు ప్రదేశాలలో వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్ లుగా గుర్తించిన ఇరవై ఏడు ప్రదేశాలలో కుడా ప్రమాదాలు నివారణకు తెసుకోవలసిన చర్యల గూర్చి ప్రతిపాదనలు సిద్దం చేయాలని రోడ్డు,భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులలో రోడ్డు సేప్టీపనులను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల అధికారులకు అదేశించారు. అనుమతి లేని బ్యాన్లర్లు తొలగించాలని, అటువంటివాటిపై అపరాదరుసుం విధించాలని, అనుమతిలేని బ్యానర్లు, హోర్డింగులను గుర్తించి చర్యలు తీసుకొనుటకు ప్రత్యేక స్క్వాడ్ ను నియమించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. హోటల్లు, డాబాల వద్ద పార్కింగు ఏర్పాట్లుచేయాలని, నిబంధనలు పాటించని వాటిని గుర్తించి చర్యలు తీసుకోవలసినదిగా తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా వాహనాలలో మనుషుల ప్రయాణం నిషేదమని, ట్రాక్టర్లు, గూడ్సు వాహనాలలో మనుషుల రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్.టి.సి. డ్రైవర్లు కొంతమంది నిర్లక్షంగా, దురుసుగా డ్రైవింగు చేయడం గుర్తించడమైనదని అటువంటి వారిని గుర్తించి చర్యలుతీసుకొనుటకు ప్రత్యేకంగా ప్రతిరూటులో పర్యవేక్షకులను నియమించాలని తెలిపారు. ప్రతి 108 వాహనంనకు జి.పి.ఎస్. వ్యవస్థ ఉండాలని తెలిపారు.
జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి ఎం . శశికుమార్ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళిక గూర్చి వివరించారు. జిల్లాలో రోడ్డుప్రమాదాలు జరుగుచున్న ఆరు అత్యంత ప్రమాద, ఇరవైఏడు బ్లాక స్టాట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. అక్కడ ప్రమాదాలు జరుగుచున్న కారణాలను గుర్తించటకు , నివారణ చర్యలు చేటట్టుటకు వివిధశాఖల అధికారులతో కమిటీ వేసి తీసుకోవలసిన చర్యలపై నివేదిక తయారుచేసినట్లు తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ చేయాలని, రోడ్డు సిగ్నల్స్ కన్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై గీతలు వేయించాలన్నారు. ట్రిబుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగు చేస్తున్న వారికి కౌన్సిలింగు నిర్వహించి, అపరాద రుసుము విదిస్తున్నట్లు తెలిపారు. పరిమిత వేగం మించి వెళ్లుటవలన ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నాయని స్పీడ్ గన్లద్వారా అటువంటివారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.
అడిషనల్ ఎస్.పి. ఒ. దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ర్టంలో అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో ఈ జిల్లాలో ఆరు ఉన్నట్లు తెలిపారు. అక్కడ వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లాక్ స్పాట్ గా గుర్తించిన ప్రదేశాల వద్ద సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయుటద్వారా ప్రమాదం చేసిన వాహనం గుర్తించి చర్యలు తీసుకొనుటకు వీలవుతుందని తెలిపారు. రోడ్డుప్రక్కన పశువులను కట్టకుండా నివారించాలన్నారు. అటువంటి పశువులను తరలించుటకు, సంరక్షించుటకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పాలకొండ డి.ఎస్.పి . ఎం .శ్రావణి ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లారీ యూనియన్ నాయకుడు ఎం .వి.రమణ మాట్లాడుతూ రోడ్లు నిర్వహణ చేపట్టాలని, రోడ్లుపై గుంతలు వలన వాహనములు పాడవుతున్నాయని, నిర్వహణ భారం పెరుగుతుందని కోరగా రోడ్లుభవనాల శాఖ అధికారులను వెంటనే రోడ్డుమరమ్మత్తుపనులు చేపట్టివలసినదిగా ఆదేశించారు.
ఈ సమావేశంలో పోలీసు, రవాణాశాఖ, రోడ్లు, భవనాలు, మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.