Close

District Collector Nishant Kumar has directed the officials to fully resolve the requests received from the people for the response program and increase the level of satisfaction among them.

Publish Date : 07/09/2022
District Collector Nishant Kumar has directed the officials to fully resolve the requests received from the people for the response program and increase the level of satisfaction among them.

*ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి*

పార్వతీపురం, సెప్టెంబర్ 5: స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించి వారిలో సంతృప్త స్థాయి పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో కలక్టర్ తోపాటు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఐ టి డి ఎ ఏ పీవో సురేష్ వినతులను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 78 వినతులు అందాయి. ఎక్కువగా భూ సమస్యలు, సామాజిక పింఛన్లు మంజూరు, ఉపాధి కల్పించాలని అర్జీలు అందించారు.

* జియ్యమ్మవలస పంచాయతీ లోని జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి,అక్రమాలు జరిగినందున సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు అర్జీ అందజేశారు.

* నిర్మించుకున్న మినీ గోకులం బిల్లులు మంజూరు చేయాలని బలిజిపేట మండలం బాడుగ పేట గ్రామానికి చెందిన వై.అప్పల నాయుడు దరఖాస్తు చేసుకున్నారు.

* మండలంలోని చిన్న బొండుపల్లి గ్రామానికి చెందిన బి.చిన్నమ్మ దివ్యాంగురాలైన తనకు మూడు చక్రాల సైకిలు మంజూరు చేయాలని కోరారు.

* పాచిపెంట మండలం కునుబందవలస గ్రామం చెందిన ఎం.పార్వతి గత రెండు సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం తిరుగుతున్నామని కానీ ఎటువంటి ప్రయోజనం లేదని మాకు రేషన్ కార్డ్ ఇప్పించవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు.

* మండలంలోని కొత్త బెలగాం చెందిన జి.శంకరావు, జి.నరసింహారావు పట్టా నెంబర్ 217 లో ఒక ఎకరా 49 సెంట్లు సాగుభూమి కలదు, మా భూమికి సాగు చేసినప్పుడు సామాగ్రి తీసుకువెళ్లేందుకు, నీటి సరఫరా చేసినప్పుడు తీవ్ర ఇబ్బందికి గురి చేయుచున్నారు వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా దరఖాస్తు పెట్టుకున్నారు.

* పాలకొండ మండలం యారకలయపురం గ్రామానికి చెందిన టి.త్రినాధ రావు గ్రామపంచాయతీ బిల్డింగ్ ను నిర్మించితిని సదరు ఆ బిల్డింగ్ యొక్క బిల్లులు చెల్లించకుండా ఆ బిల్డింగ్ యొక్క వర్క్ ఐడి నిలుపుదల చేసి ఉన్నారు ఆ వర్క్ ఐడిని మరల రియాక్టివ్ చేసి బిల్లులు చెల్లించవలసిందిగా కోరారు.

* చినతోలుమండగూడ గ్రామం జియ్యమ్మవలస మండలానికి చెందిన ఎస్. గౌరీశ్వరావు వెలుగులో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను గత 2021 ఏప్రిల్ నుండి జీత భత్యాలు రానందున ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు.

* తురకనాయుడువలస గ్రామం జిఎం వలస మండలానికి చెందిన వాకాడ స్వామి నాయుడు గత 30 సంవత్సరాలుగా నా స్వాధీనంలో ఉన్న భూమి ఆన్లైన్లో సర్కారు వారి భూమిని చూపిస్తుంది అది మా పేరు మీద సబ్ డివిజన్ చేయవలసిందిగా దరఖాస్తు అందజేశారు.

* బంటువాని వలస గ్రామం పార్వతీపురం మండలం తోటపల్లి ప్రాజెక్ట్ నిర్వాహితులు పునర్వాస భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువకునికి ఇల్లు పట్టా మంజూరు చేయాలని బంటు.సుధీర్ దరఖాస్తు చేసుకున్నారు.

* సన్యాసిరాజుపేట గ్రామం గరువుబిల్లి మండలం చెందిన బి.లక్ష్మీనాయుడు ఎన్.పైడురాజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నామని ప్రతి నెల డయాలసిస్ చేయించాలని దానికి సంబంధించిన మందులు కొనుగోలు చేసే స్తోమత మాకు లేదని ప్రభుత్వం నుంచి వచ్చే డయాలసిస్ పెన్షన్ అందడంలేనందున పింఛను మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వికలాంగురాలకు మూడు చక్రాల సైకిళ్ ను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.