District Collector Nishant Kumar directed the officials to properly implement the Dry Day program which is organized every Friday
ప్రతి శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా పాటించాలి
పార్వతీపురం, సెప్టెంబర్ 20: ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను అదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలో అమలుజరుగుతున్న రీసర్వే, రెవిన్యూసేవలు, హౌసింగు, జగనన్నస్వచ్చ సంకల్పం, జలజీవన్ మిషన్, నాడు-నేడు, నరేగా మొదలైన సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలు, పురోగతి పై సీతంపేట ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి, బి.నవ్వ, పాలకొండ ఆర్.డి.ఒ. కె.హేమలత, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహిస్తూ శానిటేషను, స్ప్రేయింగుపనులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. జ్వరాలు అధికంగా ఉన్నాయని, వాటికి కారణమైన దోమలను అరికట్టుటకు పారిశుద్యం, దోమల నివారణ చర్యలు సరిగా చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షణ చేయాలన్నారు. రీ సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. భవనాల నిర్మాణాలకు కావలసిన స్థలాలను సేకరించి అందించాలన్నారు. గ్రామాలలో ప్రభుత్వ భవనాల కట్టుటవలన ప్రభుత్వసేవలు అందుబాటులోనికి వస్తాయని, గ్రామాల అభివృద్ది దోహదపడతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి, వారి సహకారంతో కావలసిన భూమి సేకరించాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణపనులు వేగవంతం చేయాలని, అందుకుగాను లే అవుట్ లకు రహదారి నిర్మాణాలు చేపట్టాలని మరియు అంతర్గత రోడ్లు, మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రౌండిగు మేళాలు నిర్వహించాలని, ప్రభుత్వం ఇళ్లు కట్టుకొనుటకు అందిస్తున్న సహాయం, కల్పిస్తున్న సౌకర్యాల గూర్చి ప్రచారం చేయాలన్నారు. లే అవుట్ లలో మౌళిక సదుపాయాలు కల్పిస్తే లబ్దిదారులు యిల్లు నిర్మాణానికి ఆసక్తిచూపుతారన్నారు. గ్రామాలలో కూడా మంజూరయిన ఇళ్లను వెంటనే ప్రారంభించాలని, ఎవరైనా ఆశక్తి చూపకపోతే వారికి కాన్సిల్ చేసి, ఆశక్తిగల లబ్దిదారులకు శాంక్షన్ యిచ్చి వెంటనే నిర్మాణం మొదలు పెట్టించాలని తెలిపారు. జలజీవన్ మిషన్ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలన్నారు. జిల్లాకు మంజూరైన నలబైఒక్క కోట్ల పనులను సమయంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రైల్వే విస్తరణకు సేకరించిన భూములకు పరిహారం చెల్లించిన పిదప చేపట్టవలసిన రెవిన్యూ రికార్డుల మార్పిడి, సబ్-డివిజను ప్రక్రియలనుపూర్తిచేసి భూములను రైల్వేపేరిట మార్చి వారికి స్వాధీనపరచాలని తెలిపారు. నాడు-నేడు, నరేగా ద్వారా చేపటడుతున్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయ గౌరీ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.