Close

District Collector Nishant Kumar directed the officials to process the non-financial applications received in the response program immediately and to take action on the financial applications within the stipulated time.

Publish Date : 24/08/2022
District Collector Nishant Kumar directed the officials to process the non-financial applications received in the response program immediately and to take action on the financial applications within the stipulated time.

స్పందన కు 115 ధరఖాస్తులు
పార్వతిపురం, ఆగష్టు 22: స్పందన కార్యక్రమం లో వచ్చే ఆర్ధికేతర ధరఖాస్తులను వెంటనే పరిస్కరించాలని, ఆర్దిక పరమైన ధరఖాస్తులు నిర్ణీత సమయం లోగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఓ. ఆనంద్ , జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు ప్రజలనుండి అర్జీలు స్వీకరించారు. స్పందన కు 115 ధరఖాస్తులు వచ్చాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సామాజిక, వ్యక్తిగత సమస్య లపై అర్జీలు అందజీశారు .
గరుగుబిల్లి మండలం రావుపల్లి సచివాలయం పరిది కొత్తపల్లి గ్రామస్టులు కోర్లాపు పకీరు దొర మరియు ఇతరులు పదకొండు మంది బలిజపేట మండలం గౌరీపురం,నారాయణపురం గ్రామాలలో గల 20 ఎకరాలు కొండవాలు భూమిని గత 20 సంవత్సరాలుగా సాగుచేసుకున్తున్నామని పట్టాలు ఇప్పించాలని కోరారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంనకు సర్పంచ్ బి. రాము నాయుడు మరియు రైతులు తమ గ్రామంలో పంటలను నాశనం చేస్తున్న పందుల నివారణ కు చర్యలు తీసుకొని పంటలను కాపాడాలని కోరారు. మక్కువ మండలం సంబర గ్రామకాపురస్తుడు తీర్ల నారాయణ సోబిల్లి పెదవలస రెవిన్యూ గ్రామ పరిదిలో గల తన భూమిని రికార్డులలో వేరొకరి పేరున నమోదు కాబదినదని, ప్రభుత్యం నుండి వచ్చే నష్టపరిహారం పొందలేక పోయానని, రికార్డులు సరిచేయాలని కోరారు. కురుపాం మండలం జరాడ పంచాయాతి సర్పంచ్ వూయక జ్యోతి, వైస్సర్పంచ్ ఆరిక రమేష్ తమ గ్రామానికి నీలకంటాపురం గ్రామం నుండి నిర్మించిన రోడ్డు కు కల్వర్టులు, రక్షణ గోడ నిర్మించలేదు, దీని కారణంగా అర్ టి సి బస్సులు గ్రామానికి రావడం లేదు కావున కల్వర్టులు, రక్షణ గోడ నిర్మించి తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు మరియు గ్రామంలో సి.హెచ్.డబ్లూ. ఉద్యోగిగా ఆరిక జయశ్రివాని నియామకం పంచాయతీ సర్పంచ్ కు సమాచారం లేడుండా జరిగిందని, ఆమె నియామకం నిలుపుదల చేయాలని కోరారు. జరగ గ్రామంలో గల ఆశ్రమ స్కూల్ ను 2016 లో మొండెంకల్లు గ్రామానికి తరలించగా, 2018లో ముఖ్యమంత్రి వారి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం స్కూల్ ను మరలా వారి గ్రామానికి తరలించాలని సర్పంచ్ వూయక జ్యోతి, వైస్సర్పంచ్ ఆరిక రమేష్ కోరారు. గరుగుబిల్లి మండలం గిజబ గ్రామస్తుడు మత్స సంజీవరావు సర్యె నంబరు 164 -16 లో సాగుచేసుకుంటున్న యకరా భూమిలో 70 సెంట్లు మాత్రమే పట్టా యిచ్చారని మిగిలిన 30 సెంట్లుకు కుడా పట్టా ఇప్పించాలని కోరారు. గరుగుపల్లి మండలం కొతపల్లి గ్రామం చెందిన భులోకమ్మ భూమి ఉన్నదని రేషన్ కార్డు తొలగించారని , రేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. బొబ్బిలి మండలం బొబ్బిలికి చెందిన విజయలక్ష్మి తన కుమార్తె సౌమ్యకు ఎ పి యస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, గరుగుపల్లి లో సీటు ఇప్పించాలని కోరారు. గరుగుబిల్లి మండలం చినగూడబ గ్రమానికి చెందిన టి. రమణమ్మ తన భర్త మరణించారని, భర్త పేరున గల జాబ్ కార్డు తనపేరున ఇప్పించాలని కోరారు. కొమరాడ మండలం గంగిరేగివలస పంచాయతీకి చెందిన వాలంటీర్లు మూడు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని, జీతాలు ఇప్పించాలని కోరారు. బలిజపేట మండలం చెల్లంపేట గ్రామం పి. సత్యనారాయణ వృద్దాప్య పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకొన్నారు. మక్కువ మండలం యస్. అర్. పురం గ్రామానికి చెందిన గ్రీన్ మెంబెర్స్ గా పనిచేస్తున్న డి. రామన్నదొర మరియు ఇతరులు జీతాలు బకాయిలు ఇప్పించాలని అర్జీ అందజేశారు. సాలూరు మండలం పెదహరిజనపురం నకు చెందిన కోట బుజ్జిబాబు ఒప్పంద కార్మికునిగా ఉద్యోగం కావాలని కోరారు. జి.యం. వలస మండలం కందులవానివలసకు చెందిన కందుల సింహాచలం అంగన్వాడి సహాయకురాలు ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకొన్నారు.
ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, , జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఔషద నియంత్రణ అధికారి ఏ.లావణ్య, , జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా ట్రెజరీ అధికారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.