District Collector Nishant Kumar directed the medical staff to take special care to increase the number of deliveries in the government hospital.
*ఆసుపత్రి ప్రసవాలపై శ్రద్ద వహించాలి*
పార్వతీపురం, జూన్ 8 : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సంఖ్య పెరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. పార్వతీపురం మండలం కె.ములగ గ్రామ సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ మేరకు మందులు ఉచితంగా అందిస్తున్నది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నది, లేనిది విషయాలపై ఆరా తీశారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గర్భిణీ లను గుర్తించి వారికి సకాలంలో రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనత లోపం లేకుండా పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సురక్షిత ప్రసవానికి వైద్యుల సూచన మేరకు సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని ఆశావర్కర్లు ను సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓ అర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, ఉపాధి పనులు జరుగుతున్నందున అవసరమైన కూలీలకు ఓ అర్ ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఇప్పటివరకు అందుతున్న సేవలు నమోదు, గ్రామంలో నూతనంగా ఎన్ని సామాజిక పింఛన్లు మంజూరైనవి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండాలని స్పష్టం చేశారు. సమీపంలోని నూతన సచివాలయ భవనాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీవో కె. సూరి బాబు, జాతీయ ఉపాధి హామీ పథకం ఏ పీ ఓ భాను, కార్యదర్శి జి.పకీర్, ఎమ్.ఎల్.హెచ్.పి ఎస్.లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.