Close

District Collector Nishant Kumar directed the district officials to attend the Spandana program.

Publish Date : 09/05/2022
District Collector Nishant Kumar directed the district officials to attend the Spandana program.

*స్పందనకు వినతుల వెల్లువ*

పార్వతీపురం, మే 9: స్పందన కార్యక్రమం నకు జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు మాత్రమే స్పందన కార్యక్రమం నిర్వహించాలని, స్పందన కార్యక్రమం నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. స్పందన కార్యక్రమం లో వచ్చిన ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, గ్రామ సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఎక్కువగా అర్జీలు అందజేశారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు సంయుక్త కలెక్టర్ ఒ. ఆనంద్, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాధ్, డి ఆర్ ఒ వెంకటరావు పాల్గొని వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి మొత్తం 85 వినతులు అందాయి.

జయ్యమ్య వలస మండలం అoకవరం గ్రామం పంచాయతీ లో నిర్మియిoచిన రైతు భరోసా కేంద్రం భవన అద్దె బకాయి చెలించాలని V. వెంకట రమణ కోరారు.
మరి పల్లి గ్రామానికి చెందిన శ్రీకాకుళం నరేంద్ర కుమార్ డిప్లమో పూర్తి చేశానని ఉపాధి చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
పార్వతీపురం మండలం బాలగుడబ రెవెన్యూ పరిధిలో వాగుల తూము వద్ద సర్వే జరిపించి హద్దులు నిర్ణయించాలని, చెరువు గర్భంలో ఆక్రమణలు తొలగించి హద్దులు నిర్ణయించి తూము నిర్మాణం చేపట్టాలని హాయిగా సంఘం అధ్యక్షురాలు యండా రాజేశ్వరి కోరారు.
గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన తంగుడు జయనరాణి వైఎస్ఆర్ చేయూత మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామo పంచాయతీ కార్యదర్శి రావాడ సిమ్మయ్య జీతభత్యాల బకాయిలు ఇప్పించవలసిందిగా కోరారు.
మక్కువ మండలం శంబల గ్రామం లో ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలు సక్రమంగా అందడంలేదని, గ్రామానికి వాలంటీర్ ను నియమించాలని గ్రామస్తులు నమ్మి సత్యనారాయణ ఇతరులు వినతి పత్రం అందజేశారు.
పాచిపెంట మండలం కర్ర వలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 154-3, 154-5, 155-6 లలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఎ7.18 ట్లు భూమికి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆదివాసి వికాస్ పరిషత్ అధ్యక్షులు సిహెచ్. జోగయ్య కోరారు.