Close

District Collector Nishant Kumar directed the concerned departmental officers to take departmental action against the staff who were negligent in registering the crops.

Publish Date : 20/06/2022
District Collector Nishant Kumar directed the concerned departmental officers to take departmental action against the staff who were negligent in registering the crops.

ఇ-క్రాప్ నమోదులో తప్పులు జరిగితే అధికారులపై చర్యలు
పార్వతీపురం, జూన్ 18: పంటల నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా కలక్టరు నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం ఐ.టి.డి.ఎ. సమావేశ మందిరంలో జరిగిన జిల్లా వ్యవసాయ సలహా సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయి సలహా సంఘ సమావేశాలలో తీసుకున్న తీర్మాణాలపై జిల్లా స్థాయి సంఘ సమావేశానికి ముందుగానే చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, చేప పిల్లలు, ఉద్యాన పంటల మొక్కలు సకాలంలో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇ-క్రాప్ లో పంటల నమోదు జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనానంతరం మాత్రమే పంటలు నమోదు చేయాలని తెలిపారు. వి.ఆర్.ఒ.లు కూడా ఇందులో పాల్గొనేలా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తహశీల్దారు, డివిజను అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలని తెలిపారు. ఇ-క్రాప్ నమోదులో నిర్లక్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు.
వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ పంటల ఇన్యూరెన్స్ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అర్హత కలిగిన ప్రతిరైతుకు ఈ పధకం అందించాలనన్నారు. పంటల నమోదులో పారదర్శకతకు, పొరపాట్లకు అవకాశం లేకుండా చేయుటకు గ్రామ రెవిన్యూ అధికారులను కూడా బాధ్యులు చేయాలని సూచించారు.
వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, శాఖాపరమైన నివేదిక సమర్పించారు.
మొదటి శుక్రవారం ఆర్ బి కే స్థాయిలోనూ, రెండవ శుక్రవారం మండల స్థాయి ఈ సమావేశంలో వచ్చిన సలహాలను జిల్లా స్థాయి సమావేశం ముందుంచారు.
వ్యవసాయ శాఖకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారి నివేదిక సమర్పిస్తూ జిల్లాలో 25 వేల రెండు వందల యాభై క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే ఏడు వేల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామన్నారు.అవసరమైన విత్తనాలను స్టాకు పాయింట్లకు తరలించినట్లు తెలిపారు. 48వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 8 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఉద్యానశాఖకు సంబంధించి జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కలు రైతులకు కావలసినన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఎ.పి.ఎం .ఐ.పి. అధికారులు నివేదిక సమర్పిస్తూ ఆర్.బి.కె. లద్వారా రైతుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఇప్పటి వరకు 168 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు.
పశుసంవర్దక శాఖ సంబంధించి పశువులు, మేకలు, గొర్రెలకు ఇన్సూరెన్స్ పధకం అమలవుచున్నదని తెలిపారు. దేశవాళి పశువుకు 17 వేల రూపాయలు, సంకరజాతి పశువుకు 30 వేల రూపాయలు పశువు మరణిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. 200 మంది రెతులకు ఇన్సూరెన్స్ మంజూరయిందని ఇప్పటివరకు 52 లక్షల రూపాయలు అందించగా ఇంకను 1.70 కోట్లరూపాయలు చెల్లించవలసి ఉందనితెలిపారు. మరియు 60 శాతం ఇన్పుట్ సబ్సిడీపై పశువుల దాణా అందిస్తున్నట్లు తెలిపారు. 1962 నంబరు ద్వారా ఇంటి వద్దకు పశువులకు వెద్యసేవలు అందిస్తున్నారని, అంబులెన్స్ కూడా ఆందుబాటులో కలదని తెలిపారు. మత్స శాఖ ద్వారా జిల్లాలో ఆరులక్షల యాబది వేల చేపపిల్లలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఒ. ఆనంద్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.