Close

District Collector Nishant Kumar directed the authorities to take prompt action on the response applications and resolve them within the stipulated time.

Publish Date : 21/06/2022
District Collector Nishant Kumar directed the authorities to take prompt action on the response applications and resolve them within the stipulated time.

స్పందన ధరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకొని, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజలనుండి వినతులు స్వీకరించారు.
స్పందన కార్యక్రమంలో మొత్తం 108 మంది వినతులు సమర్పించి తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను పరిష్కరించవలసిదనిగా కోరారు.
మక్కువ మండలం శంబర గ్రామ అరటిరైతులు పుచ్చల ఎరుకునాయుడు ఇతరులు తమ గ్రామంలో చాలామంది రైతులు అరటి పండిస్తున్నారని, 2021-22 సంవత్సరానికి అరటిపంట భీమా వివరాలు సరిగ్గా నమాదు చేయకపోవుట వలన అరటి పంట గల రైతులకు భీమా రాలేదని, అరటి పంట వేయని రైతులకు భీమా డబ్బులు జమ అయ్యాయని, దీనిపై దర్యాప్తు చేసి అరటి రైతులకు భీమా అందించాలని, బాధ్యులైన అగ్రికల్చరల్ సహాయలకులపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు.
సీతానగరం మండలం కృష్ణారాయపురం గ్రామం నకు చెందిన మర్రి బలరాం నాయుడు, మరియు ఇతర ఆయకట్టు రైతులు గ్రామంలో సర్వే నెంబరు 193 గల 10 ఎకరములు విస్తీర్ణం గల జెక్కువానిబంద చెరువుగట్టును కొంతమంది వ్యక్తులు జె.సి.బి.లతో చదునుచేసి చెరువులో నీరు నిలువలేకుండా చేస్తున్నారు. దానివలన ఆయకట్టుభూములకు నీరు అదే పరిస్థితి లేకుండా పోతుంది కావున తగుచర్యలు తీసుకొని తమ భూమలకు నీరు అందించాలని కోరారు.
మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన బంకుడు పారమ్మ, చుక్క నారాయణమ్మ తమ పిత్రార్జితమైన భూమిలో వనంతుల నారాయణ నాయుడు అనే వ్యక్తి బోరు, కరెంటు స్థంబాలు వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బామిని మండలం పెదదిమిలి గ్రామం నుండి ఎల్. నాగరాజు గ్రామంలో ఎస్.సి.కాలనీ కి ఆనుకొని గెడ్డపై వంతెన నిర్మించి, స్మశానంనకు దారి ఏర్పాటు చేయాలని కోరారు.
బావిుని మండలం పెద్ద దిమిలి గ్రామానికి చెందిన దవరసింగి తవిటయ్య ఆసని తుఫాను సమయంలో తన పూరిగుడిసె పడిపోయినదని, ఇల్లు కట్టుకొనే స్థోమత లేదని, గుడిసెకు పైకప్పు వేసుకొనుటకు 10 సిమెంటు రేకులు ఇప్పించవలసినదిగా కోరారు.
కొమరాడ మండలం దుగ్గి గ్రామానికి చెందిన వంగళ రామారావు తనకు 16 సంవత్సరముల క్రితం ఇంటిస్థలం పట్టా యిచ్చారని ఇంతవరకు స్థలం కేటాయించలేదని, కావున స్థలం కేటాయించి, యిల్లు మంజూరు చేయాలని వినతి అందించారు.
చినంకాలం గ్రామానికి చెందిన ప్రజలు తమగ్రామంలో జరుగుచున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీపధకం అవినీతి జరుగుతుందని, క్షేత్ర సహాయకులు గా పనిచేస్తున్న బోను సత్యనారాయణ ఉపాధి హామీ పనులలో గ్రామంనుండి విశాఖ,యితర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు నమోదు చేసి వారిపేరున సుమారు ఎనిమిది లక్షల రూపాయలు డ్రాచేసినారని పిర్యాదుచేసారు. సదరు సొమ్మును రికవరీచేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కొమరాడ మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన తొడంగి సోమేశ్వరరావు జగనన్నఇళ్లు పునాదుల బిల్లు చెల్లించవలసినదిగా కోరారు.
సాలూరు మండలం ఎగువమెండంగి గ్రామానికి చెందిన శ్రీదరపు బేషు చెరువుపనులు బిల్లులు ఆన్ లైన్ లో పెండింగులో ఉన్నాయని, వెంటనే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందన కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఒ.ఆనంద్, ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి ఆర్.కూర్మనాధ్, డి.ఆర్.ఒ. జె.వెంకటరావు ప్రజలనుండి వినతులు స్వీకరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.