District Collector Nishant Kumar directed the authorities to give top priority to the speedy resolution of requests from the people for the Spandana program.
*వినతులు పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వండి*
పార్వతీపురం మన్యం, జూన్ 13: స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన వినతుల సత్వర పరిష్కారానికి తొలి ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ , ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి అర్ . కూర్మనాధ్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ మండలాల నుంచి అయా సమస్యలపై వినతులు అందించగా 98 దరఖాస్తులు అందాయి. వీటిలో ఉపాధి కల్పించాలని, సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని ఎక్కవగా వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
* సాగు చేసిన నిమ్మ గడ్డి ని కుప్పల వాడ బాయిలర్ వద్ద బాయిల్ చేయుటకు అటవీశాఖ అధికారులు అనుమతిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కొమరాడ మండలం కప్పల వాడ గ్రామానికి చెందిన హిమకర జోగన్న , పలువురు గిరిజన రైతులు వినతి పత్రం అందజేశారు.
* నూతనంగా ఏర్పాటు అయిన గొట్టూరు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలను నోటిఫై చేయాలని పాచిపెంట మండలం గొట్టూరు గ్రామ సర్పంచ్ వినతి పత్రాన్ని సమర్పించారు.
* గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల లో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గొట్టూరు గ్రామానికి చెందిన ఎస్. భాస్కర్ రావు తో పాటు పలువురు కోరారు.
* మండలంలోని బంద లుప్పి గ్రామాలోని స్మశాన వాటిక కు రహదారి నిర్మాణం, చుట్టూ రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ని అదే గ్రామానికి చెందిన జిల్లా బిజెపి ఎస్ సి మోర్చ అధ్యక్షులు పి.అప్పారావు కోరారు.
* సీతానగరం మండలం క్రిష్ణ రామపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని జక్కువానిబంధ ను కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్న నిలువరించి చెరువు విస్తీర్ణాన్ని సర్వే జరిపించి ఉపాధి హామీ పనులు కల్పించాలని పెదం కలం గ్రామానికి చెందిన బలగ రామినాయుడు ఫిర్యాదును అందించారు.
* వీధిలో మంచి నీటి కొళాయి పాయింట్లు ఏర్పాటుచేసి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని మండలంలోని నర్సిపురం గ్రామానికి చెందిన పి. వెంకటరమణ కోరారు.
* బలిజిపేట మండలం పాత్రువలస పంచాయతీ జగనన్న కాలనీ లో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించినందున పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని మాజీ శాసన సభ్యులు బి.చిరంజీవులు అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ఓ బి.జగన్నాథం, గిరిజన సంక్షేమ శాఖ డి ఈ ఈ ఎమ్.తిరుపతి నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ సింహాచలం లతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.