Close

District Collector Nishant Kumar directed the authorities to ensure that farmers plant paddy seeds ten days in advance in areas where irrigation water is available for the kharif season this year.

Publish Date : 17/05/2022
District Collector Nishant Kumar directed the authorities to ensure that farmers plant paddy seeds ten days in advance in areas where irrigation water is available for the kharif season this year.

*పది రోజులు ముందుగా వరినాట్లు వేయాలి,*

పార్వతీపురం మన్యం, మే:16:ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించి సాగు నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో పది రోజులు ముందుగా రైతులు వరి నాట్లు వేసే విధంగా సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ వరిపంటకు సాగునీటి విడుదలపై వెలగపూడి నుండి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రావు, నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సాగునీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో నీటిని విడుదల చేసేందుకు 10 నుంచి 15రోజుల ముందుగా రైతులు వరి నాటు వేసే విధంగా సమాయత్తం చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి, రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు సాగునీటి విడుదల, పంట దిగుబడి పై అవగాహన కల్పించాలన్నారు. రైతుకు పంట నష్టం జరగకుండా నీటిపారుదల శాఖ, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు నిల్వ సామర్థ్యం, పంపిణీకి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్.లో జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు కార్యనిర్వాహక అధికారి ఎన్.శ్రీనివాస్ రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఏ. నాగభూషణరావు,జంఝావతి, తోటపల్లి రిజర్వాయర్ డీ ఈ ఈ లు టి. రఘునాథ నాయుడు, పి. యు.అప్పారావు, డి. ఉదయ భాస్కర్ , తదితరులు పాల్గొన్నారు.