District Collector Nishant Kumar directed the authorities to complete 100 per cent grounding for schemes like Housing, Secretariats, Farmer Assurance Centers etc. sanctioned in the district.
శతశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలి
పార్వతిపురం, మే 17: జిల్లాలో మంజూరైన హోసింగ్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మొదలైన పధకాలకు శతశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
గృహ నిర్మాణాలు పై సమీక్ష నిర్వహిస్తూ లక్షాలు మేరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని,
ఇంటి నిర్మాణ పనులు దశలవారీగా పురోగతి ఉండాలన్నారు.
పథకం అమలులో సచివాలయం స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలన్నారు. ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్స్ లక్ష్యంమేరకు యివ్వాలన్నారు.
నరేగా పథకం ద్వారా ఉపాధి కల్పన వేగవంతం చేయాలని, రోజువారీ లక్ష్యాలను, పంచాయతీ వారీగా నిర్దేశించుకుని లక్ష్యం పూర్తి చేయాలన్నారు. కనీస వేతనం వచ్చేవిదంగా చూడాలని, పనిని బట్టి కూలీలను కేటాయించాలని, చిన్న పనికి ఎక్కువ మందిని పెడితే వేతనం గిట్టుబాటు కాదన్నారు.
ఇంటి ఆధార్ సీడింగ్, ఈ కే వై సి, విద్యుత్ కనెక్షన్ ఆధార్ సీడింగ్, పధకాలు పెండింగ్ లబ్ధిదారులు వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. స్పందన, మీ సేవ, ఈ సేవ లలో దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు.
ప్రతి పధకం సచివాలయం వారీగా డేటా తయారు చేసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే ముందుగా గ్రామ సదస్సులు నిర్వహించి మొదలుపెట్టాలని, గ్రామస్తులకు ముందుగానే సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. మొదటి సభలో సమాచారం అందించి సర్వేకు ముందుగానే మ్యుటేషన్ పూర్తిచేయాలని, లేనిచో సర్వే సమయంలో తప్పనిసరిగా మ్యుటేషన్ చేయాలన్నారు. రెండవ గ్రామ సభలో వ్యక్తిగత నోటీసులు అందించి సర్వే మొదలు పెట్టాలని తెలిపారు.డిజిటల్ సంతకం పెండింగ్ పూర్తిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.