District Collector Nishant Kumar directed bank officials to provide crop loans to all ROFR graduates.
రెండువేల కోట్ల రూపాయలు పంటరుణాలు లక్ష్యం
ఆర్.ఒ.ఎఫ్.ఆర్ పట్టాదారులందరికీ పంటరుణాలు అందించాలి
వ్యవసాయ, మత్స్య సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించాలి.
పార్వతీపురం, సెప్టెంబరు 06: ఆర్.ఒ.ఎఫ్.ఆర్ పట్టాదారులందరికీ పంటరుణాలు అందించాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ బ్యాంకు అధికారులను అదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో బ్యాంకు అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మట్లాడుతూ రైతులకు, జిల్లాలో గల సుమారు యాబదినాలుగువేల ఆర్.ఒ.ఎఫ్.ఆర్ పట్టాదారులందరికీ పంటరుణాలు తప్పనిసరిగా మంజూరుచేయాలని తెలిపారు. గత సంవత్సరం కంటే తగ్గకుండా, వీలైనంత ఎక్కువమంది రైతులకు రుణాలు అందించాలన్నారు. రెండువేల కోట్ల రూపాయలు పంటరుణాలు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఒక్క ధరఖాస్తుకూడా తిరస్కరణకు గురికాకూడదని, రుణ దరఖాస్తులు తిరస్కరిస్తే తగిన కారణాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయం స్థాయిలో వ్యవసాయ సహాయకులు పంటరుణాలకు సంబంధించి ప్రతిరైతు నుండి ధరఖాస్తులు సేకరించి, బ్యాంకు వారికి అందించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన బ్యాంకు సేవలందించుటకు ప్రతి పదిహేను వేల జనాభాకు ఒక బ్యాంకు ఉండాలని తెలిపారు. కురుపాం, భామిని, కొమరాడ, జియ్యమ్మవలస మండలాలలో బ్యాంకు శాఖలు ప్రారంభించాలని ఆదేశించారు. కొత్తగా ప్రారంభించే శాఖలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలని డి.ఆర్.డి.ఎ., నేషనల్ హైవేస్ అధికారులకు తెలిపారు. పెండింగులో గల జగనన్నతోడు రుణాలు ఈ నెల 13వ తేదీకల్లా మంజూరు చేయాలన్నారు. మొదటిసారి పూర్తిగా రుణం చెల్లించినవారికి వేయిఅదనంగాను, రెండవ సారి రుణం చెల్లించిన వారికి రెండువేలు ప్రకారం అదనంగా రుణం మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్బర్ నిధి ద్వారా యువతకు రుణాలు మంజూరు చేయాలని, దీనికి కూడా ప్రభుత్వం సకాలంలో రుణంతీర్చిన వారికి మరింత రుణం మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఉద్యోగకల్పన కార్యక్రమం పధకం, ముద్ర రుణాలు ద్వారా యువతను వ్యవసాయ, మత్స్య,పాడి అధారిత యూనిట్స్ ప్రోత్సహంచాలని తెలిపారు. మత్స్య సంపదకు, మనజిల్లా అనుకూలమని, సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈ పధకాల పట్ల యువతకు అవగాహన కల్పించుటకు మండల అభివృద్ది అధికారులు, బ్యాంకర్లు, డి.ఆర్.డి.ఎ., ఎ.పి.డి., పరిశ్రమల శాఖ అదికారులు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
లీడ్ బ్యాంకు మేనేజరు జె.ఎల్.ఎన్.మూర్తి మాట్లాడుతూ 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలలో వివిధ కార్పొరేషన్లద్వారా బి.సి., ఎస్.సి., ఎస్.టి. వర్గాలవారికి ఉపాధికల్పనకు మంజూరుచేసిన రుణాలు యూనిట్లు గ్రౌండింగు చేయకపోతే సబ్సీడీ మొత్తాన్ని సంబంధిత కార్పొరేషనుకు తిరిగిచెల్లించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఒ. ఆనంద్, ఆర్.బి.ఐ.బ్యాంకు ఎల్.డి.ఒ. ఎ.నాగప్రవీణ్, డి.ఆర్.డి.ఎ. ప్రోజెక్టు డైరెక్టరు వై. సత్యం నాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాము, జిల్లా పశుసంవర్థక అధికారి ఎ. ఈశ్వరరావు, జిల్లా బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆర్. గెడ్డమ్మ, జిల్లా మత్యశాఖాధికారి వి.తిరుపతయ్య, డి.సి.సి.బి. బ్యాంకు, శ్రీకాకుళం సి.ఇ.ఒ. వరప్రసాద్, ఎ.పి.ఎం.ఐ.పి. ప్రోజెక్టు డైరెక్టరు ఎల్. శ్రీనివాసరావు, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.