District Collector Nishant Kumar congratulated the best teachers of the state.
*రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు*
పార్వతీపురం, సెప్టెంబర్ 12 : రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందనలు తెలియజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు డోకిశీల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం. వాసుదేవ రావు, ఓని ఎంపియుపి పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు జి.సూర్యనారాయణ, వి.ఎస్.ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం) జె.బి. తురుమలాచార్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మరింత మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుండి గుర్తింపు పొందాలని ఆకాక్షించారు. ఉత్తమ ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో విజ్ఞానానికి, నైపుణ్యానికి కొదవ లేదని పేర్కొంటూ గుణాత్మక, ప్రామాణిక విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజానికి ముఖ్యంగా భావితరాలకు నైతిక విలువలు నేర్పడం ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతి ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా నుండి ఉత్తమ ఉపాధ్యాయులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు తదితరులు పాల్గొన్నారు.