District Collector Nishant Kumar clarified that Farmer Assurance Centers (RBKs) should be one-stop centers. A video conference was held on Tuesday with officials of the agriculture and allied departments
*ఆర్.బి.కె వన్ స్టాప్ కేంద్రంగా ఉండాలి*
* ప్రమాదకర రసాయనాల వినియోగం మోతాదుకు మించరాదు
పార్వతీపురం, మే 10 : రైతు భరోసా కేంద్రాలు (ఆర్.బి.కె) వన్ స్టాప్ కేంద్రాలుగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం నుండి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు ద్వారా జరగాలని ప్రభుత్వ ఆలోచన అని దానిని పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఆర్.బి.కెలు రైతుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని సేవలు పకడ్బందీగా అందాలని ఆయన స్పష్టం చేశారు. రైతుకు విత్తనం సరఫరా నుండి రైతు మార్కెటింగ్ చేసుకునే వరకు ఆర్.బి.కె సేవలు అందించాలని అందుకు తగిన విధంగా పూర్తి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఖరీఫ్ సీజన్ వస్తుందని రైతులకు అవసరమగు విత్తనాలు, ఎరువులు ఆర్.బి.కెల వారీగా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు అవసరాలు పక్కాగా అంచనా వేయాలని, సీజన్ లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవు అనే సమస్య రాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆర్.బి.కె వారీగా పక్కాగా ప్రణాళికలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ను మ ముందుకు తీసుకు రావాలని ఆయన సూచించారు. తద్వారా రెండవ పంట వేయుటకు అవకాశం ఉంటుందని రైతులకు ఆదాయం లభిస్తుందని ఆయన చెప్పారు. రెండవ పంటగా ఆరుతడి పంటలు వేయుటకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. పి.ఎం.కిసాన్ దరఖాస్తులు తక్షణం విచారణ పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. మండలంలో కౌలు రైతులను గుర్తించి వారికి తగిన ధృవీకరణ పత్రాలు అందజేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై వ్యవసాయ అధికారులు శ్రద్ద వహించాలని ఆయన అన్నారు.
పండ్లు తదితర పంటలపై కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాల వినియోగం మోతాదుకు మించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డిని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ నియామకం జరగాలని, సమావేశాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పురుగు మందులు వినియోగంపై రైతులకు శిక్షణ కల్పించాలని ఆయన అన్నారు.
పశు సంవర్ధక అధికారులు సంబంధిత వాక్సినేషన్ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో వివిధ పశు వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని అన్నారు. ఎక్కడా పశువులు మృతి చెందారని ఆయన పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, ఎపిఎం.ఐ.పి ప్రాజెక్టు డైరెక్టర్ కె. మన్మథ రావు, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ షేక్ యాసిన్, మత్స్య శాఖ అధికారి గంగాధర రావు, తదితరులు పాల్గొన్నారు.