Close

* Crop insurance of Rs. 15.99 crore per district * – District Collector

Publish Date : 18/06/2022
* Crop insurance of Rs. 15.99 crore per district * - District Collector

*జిల్లాకు రూ.15.99 కోట్ల పంటల బీమా*

– జిల్లా కలెక్టర్

పార్వతీపురం, జూన్ 14 : వై.యస్.ఆర్ పంటల ఉచిత బీమా క్లైమ్ క్రింద జిల్లాకు రూ.15.99 కోట్లు విడుదల అయ్యాయి. ఖరీఫ్ 2021లో ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు పంట బీమా క్లెయిమ్లను మంగళవారం ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సత్య సాయి జిల్లా నుండి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం చేశారు. పార్వతీపురం ఐటిడిఎ గిరి మిత్ర లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాకు పంటల భీమా క్రింద 5989 మంది రైతులకు రూ.15.99 కోట్లు జమ అవుతుందన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం మండలం చెందిన 30 మంది రైతులకు రూ.4.59 లక్షలు, బలిజిపేట చెందిన 144 మంది రైతులకు రూ.1730 లక్షలు, సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలం చెందిన 922 మంది రైతులకు రూ.3.47 కోట్లు, పాచిపెంట మండలంలో 162 మంది రైతులకు రూ.55.18 లక్షలు, మక్కువ మండలంలో 490 మంది రైతులకు రూ.1.55 కోట్లు, కురుపాం నియోజకవర్గంలో కురుపాం మండలానికి చెందిన 448 మంది రైతులకు రూ.1.18 కోట్లు, గుమ్మ లక్ష్మీ పురంకు చెందిన ఏడుగురు రైతులకు రూ.54 వేలు, జియ్యమ్మ వలస మండలంకు చెందిన 2,129 మంది రైతులకు రూ. 4.93 కోట్లు, కొమరాడ మండలంలో 483 మంది రైతులకు రూ.1.53 కోట్లు, గరుగుబిల్లి మండలంకు చెందిన 575 మంది రైతులకు రూ.1.25 కోట్లు, పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలానికి చెందిన 160 మంది రైతులకు రూ.11 లక్షలు, సీతంపేట మండలానికి చెందిన తొమ్మిది మంది రైతులకు రూ.74 వేలు, భామిని మండలానికి చెందిన ఒక రైతుకు రూ 18 వేలు, వీరఘట్టం మండలంలో 470 మంది రైతులకు రూ.1.19 కోట్లు విడుదలైందని పేర్కొన్నారు. రైతులు ఇ క్రాప్ లో విధిగా నమోదు చేసుకోవాలని కోరారు. దీని వలన ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయని ఆయన వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారం తదితర అన్ని అంశాల్లో లబ్ధి పొందవచ్చని అన్నారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

కురుపాం మండలం వియ్యాలవలసకు చెందిన జి.చిన్నారావు అనేరైతు మాట్లాడుతూ ఇ పంట నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. తద్వారా అన్ని ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తన భార్యకు రూ.60 వేలు ప్రభుత్వం నుండి లబ్ది చేకోరిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, వ్యవసాయ శాఖ అధికారులు నాగభూషణ రావు, రాజ గోపాల రావు, రేఖ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.