* Chief Secretary to Government Sameer Sharma conducts video conference with District Collectors *
*జగనన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి అధిక ప్రాధాన్యత*
*నిర్దేశించిన గడువులోగా ఇండ్లను పూర్తి చేయాలి…*
*స్పందన అర్జీలు పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలి….*
*అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు అందాలి…*
*జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ*
పార్వతీపురం, జూన్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణాల పూర్తిగా అధిక ప్రాధాన్యతఇవ్వాలని, నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం హౌసింగ్, ఓటిఎస్, స్పందన, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇల్లు లేని ప్రజలందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. జిల్లాల కలెక్టర్లు జగనన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల ఇళ్లన్నీ పూర్తి చేయించేందుకు కృషి చేయాలన్నారు.
స్పందన కార్యక్రమానికి సంబంధించి అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీలు చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా, లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు రోజు వారి లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సంభందిత అధికారులు పాల్గొన్నారు.