At a response event held at the Collector’s office on Monday, people turned out in large numbers and handed out petitions asking for the issues to be resolved. 110 responses were received during today’s Spandana event.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంనకు ప్రజలు భారీగా హాజరై సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో 110 వినతులు వచ్చాయి.
స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఒ. ఆనంద్,సబ్ కలెక్టర్ భావన, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాధ్, డి ఆర్ ఒ వెంకటరావు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
స్పందన కార్యక్రమంలో వినతులు అందించిన వారిలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోగల జగన్నాధపురం గ్రామంలో సర్వే నంబర్ 113/1 నందు గల చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు.
వీరఘట్టం గ్రామానికి చెందిన జామి అప్పన్న అచ్చపువలస గ్రామం లో సారాపు తిరుపతిరావు అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా రైస్ మిల్లు నిర్మిస్తున్నారని మరియు నిర్మాణానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్వతీపురం మండలం బెల్గాం, వెంకంపేట, సుందర నారాయణపురం గ్రామాలకు చెందిన జె.గుర్నాథరావు మరియు ఇతరులు వెంకoపేట గ్రామానికి గల 60 అడుగుల వెడల్పుగల రోడ్డును నాగుల వెంకటరావు రైస్ మిల్ వారు 7 అడుగులు ఆక్రమించి కొనుగోలు చేస్తున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
బలిజిపేట మండలం లో పి. చాకర్లపల్లి గ్రామంలో నిర్మించిన సచివాలయం పేరును పెద్ద మాను వలస నుండి పి. చాకర్లపల్లి గా మార్చాలని కె. అయ్యప్ప తదితరులు కోరారు.
బలిజిపేట మండలం గారగా గ్రామo నకు చెందిన గంటా రామునాయుడు భూమిలో గల టేకు చెట్లను తాళ్లపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా నరికి తరలించారని, పక్కన గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు.
జిల్లేడువలస గ్రామస్తులు తమ గ్రామంలో గల స్కూల్ భవనం శిథిలావస్థలో ఉందని కొత్త భవనం మంజూరు చేయాలని కోరారు.
సాలూరు మండలం కే కొత్తవలస గ్రామానికి చెందిన టి.లచ్చయ్య గ్రామస్తులు గ్రామంలో గల అంగన్వాడి భవనం రోడ్డు ప్రక్కన కలదని, పిల్లలకు భద్రత లేదని అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ మంజూరు చేయాలని కోరారు. మరియు పెన్షన్లు, ఇంటి స్థలాల కొరకు, వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు అందాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.