Close

District Collector Nishant Kumar said that the marketing opportunities can be improved by providing branding to the goods produced by tribals through One Dhan Vikas Kendras.

Publish Date : 29/09/2022
District Collector Nishant Kumar said that the marketing opportunities can be improved by providing branding to the goods produced by tribals through One Dhan Vikas Kendras.

గిరిజన ఉత్పత్తులకు బ్రాండింగు, మార్కెటు కల్పించాలి
పార్వతీపురం, సెప్టెంబరు 28: గిరిజనులు వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తిచేస్తున్న వస్తువులకు బ్రాండింగు కల్పించుట ద్వారా మార్కెటింగు అవకాశాలు మెరుగుపరచవచ్చునని జిల్లాకలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చాంబరులో ఐ.టి.డి.ఎ. అధికారులతో గిరిజన ఉత్పత్తులు, మార్కెటింగు సదుపాయాలుపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వెదురు, జీడిమామిడి, చింతపండు, ఫైనాపిల్, పసుపు, తృణధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అమ్ముట ద్వారా గిరిజనులకు లాభం చేకూర్చవచ్చునని తెలిపారు. ఉత్పత్తులకు పార్వతీపురం జిల్లాకు చెందినట్లుగా బ్యాండింగు ఇచ్చుట ద్వారా అమ్మకాలు పెంచవచ్చునని సూచించారు. పేకింగు, బ్రాండింగుతో డిజైన్ తయారుచేయాలన్నారు. ఆర్గానికి ఉత్పత్తులైన జీడిపప్పు, తృణదాన్యాలతో బిస్కెట్స్, తీపిపదార్దాలు తయారుచేసి మార్కెటింగు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు సీతంపేట, పార్వతీపురం, జి.ఎల్.పురంలలో రిటైల్ షాపులను ఏర్పాటు చేయాలన్నారు. క్వాలిటీ, పేకింగు బాగుండాలని తెలిపారు. జీడిపప్పు, బిస్కెట్ మార్కెటింగుకు బహుళజాతి సంస్థలు, విమానయాన సంస్థలతో మాట్లాడాలన్నారు.
జాయింటు కలెక్టరు మరియు పార్వతీపురం ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి ఒ.ఆనంద్ మాట్లాడుతూ చింతపండు లాభదాయకంగా ఉందని, జీడి పండ్లు వృదాగా పోతున్నాయని, వాటితో కూడా ఉత్పత్తులకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సీతంపేట ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి బి.నవ్య మాట్లాడుతూ జీడిపప్పు వ్యాపారం అభివృద్ది చేయుటకు, దిగుబడి పెంచుటకు జీడి పిక్కలు ప్రాసెంసింగు యూనిట్లకు ఆర్డరు పెట్టినట్లు తెలిపారు. వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తి చేస్తున్న పసుపు, అగరబత్తి మొదలైన ఉత్పత్తులను గూర్చి వివరించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ. ప్రోజెక్టు అధికారి వై.సత్యంనాయుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.