Close

District Medical Health Officer Dr. B. Jagannath Rao ordered that the pregnant women should be visited by the health personnel.

Publish Date : 29/09/2022
District Medical Health Officer Dr. B. Jagannath Rao ordered that the pregnant women should be visited by the health personnel.

*గర్భిణీలను సందర్శించాలి*

పార్వతీపురం, సెప్టెంబర్ 27 : గర్భిణీలను ఆరోగ్య సిబ్బంది సందర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.బి.జగన్నాథరావు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హెల్త్ ప్రోగ్రాం అధికారులతో మంగళ వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సమావేశం నిర్వహించారు. అరోగ్య కార్యక్రమాలపై , క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది విధుల నిర్వహణ, వివరాల డేటా అప్లోడింగ్ మొదలగు అంశాలపై సమీక్ష నిర్వహించారు గర్భిణిలను తరచూ సందర్శించి వారి ఆరోగ్య నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. మాతృ శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టుటకు ఆవస్యమన్నారు. ప్రసవ సమయం దగ్గరగా ఉన్న మహిళలను, అత్యవసర పరిస్థితుల్లో తరలించుటకు రవాణా తదితర సమస్యలు ఉన్న ప్రాంతాల గర్భిణీలను ముందుగా తరలించాలని ఆయన సూచించారు. అంటు వ్యాధులు, అంటు వ్యాధులు కాని వ్యాధుల (ఎన్ సి డి – సి డి) సర్వే చేపట్టి తగిన అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లల పూర్తి స్థాయి వ్యాధినిరోధక టీకా కార్యక్రమాలు, విద్యార్థుల స్క్రీనింగ్ అంశాలు మొదలగు వాటి డేటా సంబంధిత యాప్ లలో పూర్తి స్థాయి లో అప్లోడ్ అయ్యేలా ఎప్పటికప్పుడు పరిశీలించి , పర్యవేక్షణ చేయాలని తద్వారా క్షేత్ర స్థాయి లో అందుతుతున్న వైద్య సేవలను మరింత నిశితంగా పరిశీలించవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విజయమోహన్ , సి.హెచ్ విజయకుమార్ , టి.జగన్మోహన్, అనిల్ , సందీప్, డి పి ఒ లీలారాణి , డేటా అధికారి శంకర్ పాల్గొన్నారు.