District Collector Nishant Kumar directed the officials to resolve the requests received in Spandana.
*స్పందన వినతులు సత్వరం పరిష్కరించాలి*
పార్వతీపురం,సెప్టెంబర్ 26 : స్పందనలో అందిన వినతులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్పందన కార్యక్రమం జరిగింది. 95 ధరఖాస్తులు స్పందన కార్యక్రమంలో అందాయి. ఆర్జీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మక్కువ మండలం చెక్కవలస గ్రామానికి చెందిన ఎమ్.జాజమ్మ తమ పొలంలో వై. ఎస్. ఆర్. జలకళ ద్వారా వేసిన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. గుమ్మలక్ష్మీ పురం మండలం పి.ఆమిటి గ్రామంకు చెందిన వి. సుజాత టెట్ ఉత్తీర్ణతతో పాటు అన్నిరకాల అర్హతలు కల్గి ఉన్నానని, కాంట్రాక్ట్ పద్దతిలో ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరారు. బలిజి పేట మండలం చిలకలపల్లి గ్రామం ఎస్.వెంకట నాయుడు ఇతరుల భూమి నా ఆధార్ కు లింక్ అయిందని, తొలగించవలసినదిగా కోరారు. పార్వతీపురం మండలం శివన్న దొరవలస గ్రామంనకు చెందిన బి. కృష్ణారావు తమ గ్రామంలో ఉన్న పాఠశాల ఆవరణలో పాములు ఎక్కువుగా ఉన్నందున ప్రహారీ గోడ నిర్మిచాలని కోరారు. జి.ఎల్. పురం మండలానికి చెందిన టి.నయోమని స్థానిక కళాశాల నుండి తమ సర్టిఫికెట్లు ఇప్పించవలసిందిగా కోరారు. పార్వతీపురం మండలం కోరడవలస గ్రామానికి చెందిన ఏ. అప్పలనరసమ్మ చేయూత పథకం రావడం లేదని ఇప్పించవలసనదిగా కోరారు. బలిజి పేట మండలం గంగాడ గ్రామం నుండి జి. అప్పారావు తమకు పింఛన్ రావడం లేదని ఇప్పించ వలసినదిగా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. పాలకొండ నగర పంచాయతీ దేవరపేట జంక్షన్ నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారి పూర్తిగా పాడైనందున సిసి రోడ్డు ను నిర్మించాలని సబ్బ.నానాజీ అర్జీ అందజేశారు. గరుగుబిల్లి మండలం బురద వెంకటపురం పరిధిలోని 13 గ్రామాల్లో పి.పి.సి కేంద్రాలు నిర్వహించారని, మూడు సంవత్సరాల నుండి రావలసిన హమాలీ చార్జీలు, కమిషన్ మంజూరు చేయాలని ఎం. అనసూయమ్మ మరియు గరుగుబిల్లి మండల మహిళా సమైక్య సభ్యులు కోరారు. పార్వతిపురం పట్టణానికి చెందిన యన్.జనార్ధనరావు ప్రభుత్వం మంజూరు చేసిన సర్వే నెంబర్ 21 మెట్టు 5 ఎకరాలు భూమి పెద్దమరికిలో ఉందని, ఆ భూమిని భూ రికార్డు లో ఆన్లైన్ చేయాలని వినతి పత్రం అందజేశారు. గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి పార్వతిపురం పట్టణం కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 265 లో నిర్వాసితులకు కేటాయించిన స్థలము మీద దొంగ పట్టాలు తయారుచేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎం.కృష్ణమనాయుడు దరఖాస్తు సమర్పించారు. కొమరాడ మండలం పులి గుమ్మి గ్రామానికి చెందిన గృహ నిర్మాణ లబ్ధిదారులు 14 మందికి హౌసింగ్ బిల్లులు మంజూరు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్ జి.విజయలక్ష్మి మరియు ఇతర సభ్యులు వినతి పత్రం సమర్పించారు. కొమరాడ మండలం కల్లికోట గ్రామానికి చెందిన జి.శంకర్రావు కిరాణా షాపుపై ఏనుగులు దాడి వలన తీవ్ర నష్టానికి గురి అయ్యానని తగు సాయం చేయగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి సూర్యనారాయణ, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయ గౌరీ, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి ఎం.శశి కుమార్, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి పి. సీతారాం తదితరులు పాల్గొన్నారు.