Close

District Collector Nishant Kumar said that steps are being taken to provide a bright future for sports in the district

Publish Date : 26/09/2022
District Collector Nishant Kumar said that steps are being taken to provide a bright future for sports in the district

*జిల్లాలో క్రీడలకు ఉజ్వల భవిష్యత్తుకు చర్యలు*

పార్వతీపురం, సెప్టెంబర్ 20 : జిల్లాలో క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించుట చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా క్రీడా సాధికార సంస్థ మొట్ట మొదటి కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఇప్పటికే పలు క్రీడలు జిల్లాలో నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని క్రీడలు నిర్వహించి భావితరాలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించుటకు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో 10 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానం కోసం కేటాయించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్థల ఎంపిక చేసే బాధ్యతను జాయింట్ కలెక్టర్ కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. సీతంపేటలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియంకు అదనపు సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. జియ్యమ్మవలసలో 9.33 ఎకరాల స్థలాన్ని కేటాయించామని అందులో 400 ట్రాక్, ఖోఖో, వాలీ బాల్, కబడ్డీ తదితర క్రీడల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సి.ఎస్.ఆర్ కార్యక్రమం క్రింద క్రీడల అభివృద్ధికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాలో ఆసక్తి ఉన్న క్రీడలను గుర్తించి వాటిని అధికంగా ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.

జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు కౌన్సిల్ ఏర్పాటు, క్రీడా సాధికార సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి పి.సీతారాం, బాక్సింగ్ అర్జున అవార్డు గ్రహీత ఎస్.జయరామ్, క్రీడల శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.