Close

District Collector Nishant Kumar said that sanitation should be the first duty.

Publish Date : 26/09/2022
District Collector Nishant Kumar said that sanitation should be the first duty.

*పారిశుధ్యమే ప్రధమ కర్తవ్యం కావాలి*
: పారిశుధ్యమే ప్రధమ కర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పాలకొండ మునిసిపాలిటి పరిధి ఎన్.కె.రాజపురం, ఇందిరా నగర్ కాలనీ, నీలమ్మ కోలనీలను, వెలగవాడ, కొండాపురం వెల్ నెస్ కేంద్రాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శని వారం తనిఖీ చేశారు. రీ సర్వే డేటా ఎంట్రీ చేస్తున్న విధానాన్ని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో పరిశీలించారు. సింగన్నవలస సచివాలయం, లుంబూరు జగనన్న గృహ నిర్మాణ కాలనీ పనులు తనిఖీ చేశారు. ఎన్.కె.రాజపురం, ఇందిరా నగర్ కాలనీ, నీలమ్మ కోలనీలలో పారిశుధ్యం పరిశీలించారు. ఎన్.కె.రాజపురంలో కాలువలు లేకపోవడం పట్ల మునిసిపల్ కమీషనర్ ను ప్రశ్నించారు. పారిశుధ్యం సక్రమంగా లేకపోవడం వలన డెంగీ వంటి కేసులు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతి వీధి, వాడ పారిశుధ్యానికి నిలయంగా ఉండాలని ఆయన ఆదేశించారు. డివిజనల్ స్థాయి అధికారులను పారిశుధ్యంను పర్యవేక్షించుటకు నియమించామని కలెక్టర్ తెలిపారు. పారిశుధ్యం సమష్టి బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన హితవు పలికారు. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించి ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు నెలకొల్పాలని కోరారు. నివాసం ఉంటున్నది మనమే అని గుర్తించాలని, పారిశుధ్యం లేకపోతే అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని ఆయన వివరించారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని కమీషనర్ రామారావును ఆదేశించారు.

లుంబూరు జగనన్న గృహ కాలనీ నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాలనీలో రహదారులు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రాదాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణానికి సమీపంలో కాలనీ ఉందని, మంచి భవిష్యత్తు ఉంటుందని లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మౌళిక సదుపాయాలు కల్పించుటకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. గృహ నిర్మాణ సామగ్రి అందించడం జరుగుతుందని, బిల్లులు సకాలంలో వస్తున్నాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గ్రామ సచివాలయం, వెల్ నెస్ కేంద్రం, రైతు భరోసా కేంద్రం మంజూరు చేసిందని ఆయన అన్నారు. త్వరితగతిన పూర్తి చేసి వాటి సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆయన ఆదేశించారు. ఆర్.డి.ఓ కార్యాలయంలో రీ సర్వే పనుల డేటా ఎంట్రీ పరిశీలించిన జిల్లా కలెక్టర్ తప్పులు లేని రెవిన్యూ రికార్డులు తయారు కావాలని ఆదేశించారు. రెవిన్యూ పత్రాల జారీలో ఎటువంటి ఆటంకం ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు.