District Collector Nishant Kumar has ordered the officials to complete the construction of houses in the district by December.
*డిసెంబరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి కావాలి*
పార్వతీపురం, సెప్టెంబర్ 13 : జిల్లాలో డిసెంబరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలు రావడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మండలాల వారీగా నిర్మాణాల మేళాలను నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మండల అధికారులతో గృహ నిర్మాణం, రీసర్వే తదితర అంశాలపై మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలకొండ నియోజక వర్గంలో ఉన్న ఒకే ఒక్క లే అవుట్ లో పనులు మందకొడిగా సాగుతోందని ఆయన అన్నారు. యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. సాలూరు పట్టణ లే అవుట్, పలు మండలాల గృహ నిర్మాణాలు పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన స్పష్టం చేశారు. రీ సర్వేలో భాగంగా 22(ఎ) జాబితా కూడా తయారు చేయాలని ఆయన సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 67 సచివాలయాల పరిధిలో పూర్తి అయిందని, ఆయా సచివాలయాల పరిధిలో వచ్చిన పనులకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీర్మానాలు పూర్తి చేసి అంచనాలు తయారు చేసి, సంబంధిత ఫోటో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకే పనికి రెండు ప్రతిపాదనలు సమర్పించరాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 14 సచివాలయాల పరిధిలో మాత్రమే అప్ లోడ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది వచ్చే వారం నుండి పనులు ప్రారంభంపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
మండల అబివృద్ధి అధికారులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లను సందర్శించి, ఫోటోలు అప్లోడ్ చేయాలని తెలిపారు. రైల్వే లైను విస్తరణ పనులకు సంబందించిన భూమి సేకరణకు పరిహారం చెల్లింపులు చేయాలని, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, భూమిని రైల్వే అధికారులకు అప్పగించాలని తెలిపారు. భూముల మ్యూటేషన్ కు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు నూరుశాతం గ్రౌండింగ్ చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. భవనాల నిర్మాణానికి స్థల సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి, స్థలాలు సేకరించి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, డిఆర్డిఎ డిపిఎం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.