District Collector Nishant Kumar stated that under Netanna Nestam, financial assistance will be provided to 180 handloom workers in the district.
*నేతన్న నేస్తం క్రింద ఆర్థిక సహాయం*
పార్వతీపురం, ఆగస్టు 25 : వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం క్రింద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం గురు వారం జరిగింది. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.24 వేలు చొప్పున జమ అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ హాజరయ్యారు.
జిల్లాలో 180 మంది చేనేతకార్మికులకు ఆర్థిక సహాయం అందుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. నమూనా చెక్కులను లబ్దదారులకు పంపిణీ చేసారు. నేతన్నలు ఆర్థిక సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని చేనేత రంగంను ముందుకు నడిపించాలని కోరారు. చేనేత ఒక చక్కని కళ అని దానిని తరతరాలుగా ఆచరించడం దానికి ప్రభుత్వం ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందించడం శుభపరిణామం ఆయన చెప్పారు. పాలకొండ నియోజక వర్గంలో 37 మంది లబ్ది పొందుతున్నారని ఆయన చెప్పారు. పాలకొండ గ్రామీణ మండలంలో 9 మంది, పట్టణంలో 23 మంది, భామిని మండలంలో 5 గురు లబ్ది పొందుతున్నారని చెప్పారు. సాలూరు నియోజక వర్గంలో 17 మంది లబ్ది పొందుతున్నారని చెప్పారు. సాలూరు గ్రామీణ మండలంలో 11 మంది, పట్టణంలో ముగ్గురు, పాచిపెంట మండలంలో ముగ్గురు లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు.కురుపాం నియోజక వర్గంలో 51 మంది లబ్ది పొందుతున్నారని చెప్పారు. జియ్యమ్మవలస మండలంలో ఇద్దరు, గరుగుబిల్లి మండలంలో 49 మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. పార్వతీపురం నియోజక వర్గంలో 75 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. బలిజిపేట మండలంలో 72 మంది, పార్వతీపురం మండలంలో ఒకరు, సీతానగరం మండలంలో ఇద్దరు లబ్ది పొందుతున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారి లీలా కుమార్, జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన చేనేతకారులు తదితరులు పాల్గొన్నారు.