Retired IAS Duvvuri visited the Collectorate
*కలెక్టరేట్ ను సందర్శించిన విశ్రాంత ఐ.ఏ.ఎస్ దువ్వూరి*
పార్వతీపురం, ఆగస్టు 22 : విశ్రాంత ఐ.ఏ.ఎస్, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమ వారం పార్వతీపురంలో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంను, సబ్ కలెక్టర్ కార్యాలయంను తన సాదాసీదా పర్యటనలో భాగంగా సందర్శించారు.1974 నుండి 76 సంవత్సరం వరకు పార్వతీపురం సబ్ కలెక్టర్ గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. దువ్వూరి సుబ్బారావును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ భావన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫోటోలు దిగారు. మంచి పాలనను ప్రజలకు అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని యువ ఐ.ఏ.ఎస్ లకు ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఉద్బోధించారు. మంచి పాలనాదక్షులుగా ఉండాలని ఆకాక్షించారు. మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కోరారు.